hyderabadupdates.com Gallery Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి

Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి

Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి post thumbnail image

 
 
 
 
విచారణలో ఉన్న (అండర్‌ ట్రయల్‌) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. నిరుడు ఫిబ్రవరి 13న జారీ చేసిన ‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ)’ను ఈ మేరకు సవరించింది. ఈ వ్యవహారంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి, అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా చేసిన సూచనలను ఆమోదిస్తూ జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మల ధర్మాసనం.. సవరించిన ఎస్‌వోపీని జారీ చేసింది.
 
 
తాజా నిబంధనల ప్రకారం- విచారణలో ఉన్న పేద ఖైదీలకు పూచీకత్తు డబ్బు చెల్లించే వ్యవహారంలో ఈ క్రింది నిబంధనలు పాటించాలి.
 
ప్రతి జిల్లాలో సాధికార కమిటీని ఏర్పాటు చేయాలి.
జిల్లా కలెక్టరు లేదా జిల్లా మేజిస్ట్రేటు నామినీ, డీఎల్‌ఎస్‌ఏ, ఎస్పీ, సంబంధిత జైలు సూపరింటెండెంట్‌/డిప్యూటీ సూపరింటెండెంట్, సంబంధిత జైలు ఇన్‌ఛార్జి జడ్జి ఇందులో సభ్యులుగా ఉంటారు.
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఈ కమిటీ సమావేశాలను నిర్వహిస్తారు.
బెయిలు మంజూరయ్యాక ఏడు రోజుల్లోపు అండర్‌ ట్రయల్‌ ఖైదీ విడుదల కాకపోతే.. జైలు అధికారులు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శికి సమాచారం అందించాలి.
 
 
ఆ ఖైదీ పొదుపు ఖాతాలో డబ్బు లేకపోతే ఐదు రోజుల్లోగా కార్యదర్శి.. డీఎల్‌ఎస్‌ఏకు విన్నవించాలి.
అనంతరం ఐదు రోజుల్లోగా సాధికార కమిటీ పూచీకత్తు సొమ్మును (రూ.50 వేల వరకు అయితే) విడుదల చేయాలి.
పూచీకత్తు సొమ్ము రూ.50 వేలకు, రూ.లక్షకు మధ్య ఉంటే.. ఆయా కేసుల్లో కమిటీ తన విచక్షణను ఉపయోగించి నిధుల విడుదల నిర్ణయం తీసుకోవాలి. రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటే.. పూచీకత్తు మొత్తాన్ని తగ్గించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయొచ్చు.
ఈ కమిటీ ప్రతి నెలా మొదటి, మూడో సోమవారం భేటీ అవ్వాలి.
 
 

The post Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీPM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీ

    పెద్దసంఖ్యలో పుణ్యక్షేత్రాలున్న ఉత్తరాఖండ్‌కు అసలైన బలం ఆధ్యాత్మిక శక్తి అని, ఈ రాష్ట్రం సంకల్పిస్తే రాబోయే అయిదేళ్లలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిర్భవించిన పాతికేళ్లలో అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించి ఇతర

TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పుTG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

    2015-16 గ్రూప్‌-2ను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్‌ వినియోగం, తుడిపివేతలున్న పార్ట్‌-బి పత్రాలను

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలుCabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee : సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్,