దుబాయ్ ఎయిర్‌షోలో శుక్రవారం భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పైలట్ నమాంశ్ స్యాల్ మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియో చాలా స్పష్టంగా ఉండడం గమనార్హం. అలాగే ప్రమాదం కూడా దీంట్లో చాలా దగ్గరగా కనిపించింది. దీన్ని ఎవరు తీశారనేది మాత్రం తెలియలేదు. ఈ వీడియో నిడివి 2:03 నిమిషాలు. ప్రమాదానికి ముందు పైలట్ ఎంతో సాహసోపేతంగా, కచ్చితత్వంతో చేసిన విన్యాసాలు ఇందులో రికార్డయ్యాయి. చివరి క్షణాల్లో ఒక్కసారిగా కుప్పకూలిన తీరునూ ఇందులో గమనించొచ్చు. ఇది ‘WL Tan’s Aviation Videos (OC)’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.
ఎయిర్‌షోను వీక్షిస్తున్న ప్రేక్షకులు విన్యాసాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో అనేక వీడియోలు సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాయి. కానీ, తాజాది మాత్రం భిన్నమైన కోణంలో ఉండడం గమనార్హం.
పైలట్ నమాంశ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్డా జిల్లాలో ఉన్న నగ్రోటా భగవాన్ పట్టణం. ఆయన భార్య అఫ్సానా కూడా భారత వాయుసేనలో పైలట్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె. ఆదివారం స్వస్థలంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
The post Tejas Crash Video: వెలుగులోకి ‘తేజస్’ కుప్పకూలిన కొత్త వీడియో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Tejas Crash Video: వెలుగులోకి ‘తేజస్’ కుప్పకూలిన కొత్త వీడియో
Categories: