hyderabadupdates.com Gallery Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌

Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌

Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌ post thumbnail image

 
 
ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం కారాకట్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వీ… ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక… మీకు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది. 20 ఏళ్లుగా ఎన్డీయేకు అధికారం ఇచ్చారు. నన్ను నేను నిరూపించుకోవడానికి 20 నెలల సమయం ఇవ్వండి’ అంటూ ప్రజలను కోరారు. మరోవైపు, తేజస్వీకి కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మార్పు, ఉద్యోగాలు, సమానత్వంతో పాటు, బిహార్‌ ప్రజల అభివృద్ధి కోసం పోరాడదామని పేర్కొన్నారు. తేజస్వీ సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తేజస్వి జీవితంలో ఇంకా పురోగమించాలని తేజ్‌ ప్రతాప్‌ ఆకాంక్షించారు.
తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు ‘వై ప్లస్‌’ కేటగిరీ భద్రత
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్‌ జాతీయ అధ్యక్షుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు ‘వై ప్లస్‌’ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ మంజూరు చేసింది. శత్రువులు తనను హత్య చేసే ముప్పు ఉందని తేజ్‌ ప్రతాప్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. తనను శత్రువులు హత్యచేసే గండం ఉందని, ప్రతి ఒక్కరు శత్రువుల్లాగే కనిపిస్తున్నారని తేజ్‌ ప్రతాప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు ఉండబట్టే, తనకు కేంద్రం భద్రత పెంచిందన్నారు. అయితే తన శత్రువుల వివరాలను బయటపెట్టలేనని ఆయన స్పష్టంచేశారు.
The post Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశంCM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న

Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షాAmit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా

Amit Shah : తనయుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, కుమారుడు తేజస్విని బిహార్‌ కు ముఖ్యమంత్రిగా చూడాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పరితపిస్తున్నా ఆ రెండు పదవులూ ఖాళీగా లేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌

    ఏపీ ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌ మెక్‌ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్‌ ఎంగేజ్‌మెంట్‌ అజెండాలో ఏపీని