hyderabadupdates.com Gallery Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం post thumbnail image

Telangana Government : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు 1,031 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. దీంతో ప్రభుత్వ (Telangana Government) ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు కాగా.. పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌బీ శాఖలో 46,956 బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు
హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రజాభవన్‌లో శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వ (Telangana Government) కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ దశలవారీగా క్లియర్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ (Telangana Government) ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను రిలీజ్ చేశారు.
రూ.10లక్షల లోపు పెండింగ్‌ బిల్లులను సైతం క్లియర్ చేయాలన్న సర్కార్ నిర్ణయంలో భాగంగా పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు రిలీజ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన రూ.10లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లనూ అధికారులు రిలీజ్ చేశారు.
Telangana Government – తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయని పేర్కొంది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు జరిగేవి. ఈసారి వీరితో పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026: 
25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
27- 02 -2026 : పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1
02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
9- 03 -2026 : ఫిజిక్స్, ఎకనామిక్స్ -1
12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1
 
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ 2026:
26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
28- 02 -2026 : పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2
03- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
10- 03 -2026 : ఫిజిక్స్, ఎకనామిక్స్-2
13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1
Also Read : DK Shivakumar: ఎంపీ తేజస్వీ సూర్యపై డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్
The post Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ

విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!

వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మరియు ‘బ్యూటీ’ వంటి సినిమాలు విజయవంతంగా రీల్‌లో వచ్చాయి. విభిన్న కథలతో సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా Vijay Pal Reddy అడుగుపెట్టారు. ఇప్పుడెన్నో విజయాల తర్వాత, ఆయన మరోసారి