hyderabadupdates.com Gallery Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత post thumbnail image

Telangana Government : స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. పలు రంగాలకు భూ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్‌ కూడా ఇస్తామన్నారు.
‘‘రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం (Telangana Government) తెలిపింది. నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. నల్సార్‌ వర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 7 ఎకరాలు ఇస్తాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కేంద్రం కొనుగోలు చేసినా.. చేయకపోయినా మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. హైదరాబాద్‌ మెట్రోకు సంబంధించి కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించాం. మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.
Telangana Government – కేబినెట్ లో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
5,566 కి.మీ ఆర్‌అండ్‌బీ రోడ్లను రూ.10,547 కోట్లతో హోమ్‌ మోడల్‌లో అభివృద్ధి చేయాలని నిర్ణయం మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని నిర్ణయం కృష్ణా- వికారాబాద్‌ రైలుమార్గం కోసం భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయం భరించేందుకు కేబినెట్‌ తీర్మానం భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్‌ మార్కెట్‌యార్డ్‌కు భూ కేటాయింపు
ఎలివేటెడ్‌ కారిడార్లకు సంబంధించి రక్షణశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం
బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు – మహేహ్‌ కుమార్‌ గౌడ్‌
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రకస్తే లేదని టీపీసీసీ చీఫ్‌ మహేహ్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో బీసీ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మహేష్‌ కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడుతూ.. ‘ కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్రీయ బద్దంగా కుల సర్వే నిర్వహించి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్‌కే కట్టుబడి ఉన్నాం.
బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణ (Telangana) బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు ఇస్తున్నాం. బంద్ విజయవంతం కావాలి. బీసీ బంద్‌తో కనువిప్పు కలగాలి. అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డు పడుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి నినాదం.. ఉద్యమంగా మారింది. రాహుల్ గాంధీ నినాదం గొప్ప వరం అని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుదాం. రాజకీయాలు ఎన్నికల వరకే. రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రిజర్వేషన్ల 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు. బీజేపీ బిఆర్ఎస్‌లో పాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. సిఎం రేవంత్,నాకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
Also Read : CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌
The post Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nobel Prize: క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతిNobel Prize: క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

Nobel Prize : భౌతికశాస్త్రంలో అడ్వాన్స్‌డ్‌ క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు… ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize) వరించింది. ఆ ముగ్గురూ… బ్రిటన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త జాన్‌ క్లార్క్‌ (83), ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక