hyderabadupdates.com Gallery Telangana Police: నోరు జారి జైలుపాలయిన హత్య కేసు నిందితులు

Telangana Police: నోరు జారి జైలుపాలయిన హత్య కేసు నిందితులు

Telangana Police: నోరు జారి జైలుపాలయిన హత్య కేసు నిందితులు post thumbnail image

 
కరీంనగర్ లో ఓ హత్య కేసు నిందితులు… అనుకోకుండా పోలీసులకు పట్టుబడ్డారు. ఓ కేసులో వారిపై పోలీసులు నిఘా ఉంచగా… అది తెలియక నోరు జారడంతో గతంలో వీరు చేసిన హత్య వెలుగులోనికి వచ్చింది. దీనితో రంగంలోనికి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా… అసలు విషయం బట్టబయలు అయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….
కరీంనగర్ కు చెందిన ఓ వృద్ధురాలిని హత్యచేసిన ఇద్దరు వ్యక్తులు జైలుకెళ్లారు. తర్వాత బెయిల్‌పై తిరిగొచ్చారు. అయితే మరో నలుగురితో కలిసి గతంలో చేసిన మరో హత్య గురించి చర్చించుకుంటున్న సమయంలో విషయం పోలీసుల చెవిలో పడింది. వారు దర్యాప్తు చేయగా.. ఏడాదిన్నర క్రితం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన అనుమానాస్పద మృతి ఘటన హత్యగా తేలింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చూపారు.
కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం కథనం ప్రకారం… కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేశ్‌ (40), దేవునూరి సతీశ్‌ మధ్య భూమి విక్రయం విషయంలో విభేదాలు వచ్చాయి. అదే సమయంలో ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్న సతీశ్‌ సమీప బంధువు దేవునూరి సంతోష్ ను దినేశ్‌ బెదిరించాడు. ఈ విషయాన్ని సతీశ్‌ సోదరుడు శ్రావణ్‌కు చెప్పారు. ముగ్గురూ కలిసి దినేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు.
2024 ఫిబ్రవరి 25న శ్రావణ్‌ సమీప బంధువు చనిపోగా దినేశ్‌ అక్కడికి వచ్చాడు. ఇదే అదనుగా సతీశ్‌.. దినేశ్‌ను మద్యం తాగుదామని బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే కారు అద్దెకు తీసుకున్న సంతోష్, శ్రావణ్, దేవునూరి రాకేశ్, కుమ్మరి వికేశ్, జంగ చిన్నారెడ్డి, సతీశ్‌తో కలిసి దినేశ్‌ను మల్కాపూర్‌ కెనాల్‌ వద్దకు తీసుకెళ్లి చితకబాదారు. తర్వాత కారులో ఎక్కించుకుని జగిత్యాల జిల్లా నూకపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ మెడకు తాడుబిగించి చంపేందుకు యత్నించారు. దినేశ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కాళ్లు, చేతులు కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు. కొద్దిరోజులకు మృతదేహం లభ్యం కాగా చొప్పదండి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆగస్టులో దేవునూరి సతీశ్, శ్రావణ్‌ మరో ముగ్గురితో కలిసి గంగాధరలో ఓ వృద్ధురాలిని బంగారం, భూమి కోసం హత్య చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి జైలుకు తరలించగా.. ఇటీవలే బెయిల్‌పై వచ్చారు. ఈ క్రమంలో సతీశ్, శ్రావణ్‌తో పాటు మరికొందరు కలిసి ఒకరోజు దినేశ్‌ను హత్యచేసిన విషయమై చర్చించుకుంటుండగా విషయం అప్పటికే వారిపై నిఘా పెట్టిన పోలీసులకు తెలిసింది. దీనితో పోలీసులు సంతోష్, శ్రావణ్, రాకేశ్, సతీశ్, కుమ్మరి వికేశ్, జంగ చిన్నారెడ్డిని తమదైన శైలిలో విచారించగా… దినేశ్‌ను తామే చంపామని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసును ఛేదించిన చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, చొప్పదండి ఎస్సై నరేశ్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, రామడుగు ఎస్సై రాజును సీపీ గౌస్‌ ఆలం అభినందించి, రివార్డులు అందించారు.
 
The post Telangana Police: నోరు జారి జైలుపాలయిన హత్య కేసు నిందితులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీTejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీ

Tejashwi Yadav : బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అధికారం కోసం ప్రజలపై రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మరో అడుగు ముందుకు వేసి…

Cyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపానుCyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను

    ఆంధ్రప్రదేశ్‌కి తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తుంది. ఇది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీనితో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28,

జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అరుదైన ఘ‌న‌త సాధించారు. ఆయ‌న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్