hyderabadupdates.com Gallery TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం post thumbnail image

 
 
జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయంజాల్‌, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్‌, బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, నిజాంపేట్‌, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంతేకాకుండా మరో డిస్కమ్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. కొత్త డిస్కమ్‌ పరిధిలోకి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కనెక్షన్లు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్‌ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే పదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌కు అవసరమైన ఏర్పాట్లపై చర్చినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
క్యాబినెట్‌ మరిన్ని నిర్ణయాలు
2 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ కొనుగోలు
పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ విభాగంలో పెట్టుబడుల ఆహ్వానం
కొత్త పరిశ్రమలకు సొంతగా విద్యుత్‌ తయారీ చేసుకునేందుకు అనుమతి
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణం
పాల్వంచ, మక్తల్‌లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలపై పరిశీలన
హైదరాబాద్‌ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్‌ విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు
భూగర్భ విద్యుత్‌ వ్యవస్థతోపాటు టీఫైబర్‌ కేబుళ్ల ఏర్పాటు
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్‌ ఇండియా స్కూల్‌ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపు
ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్‌ స్కూల్‌కు 40 ఎకరాలు కేటాయింపు
జూబ్లీహిల్స్‌తోపాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు
 
The post TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్‌ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్‌ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?

    దిల్లీ ఎర్ర కోట సమీపంలో పేలుడుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న భద్రతా సంస్థలు.. అనేక కోణాల్లో సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)

PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీPM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ

    వందేమాతరం గేయం… దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ..

YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన 

రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మంగళవారం పర్యటించారు. కృష్ణా జిల్లా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా