hyderabadupdates.com Gallery TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు post thumbnail image

 
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అప్పన్న రిమాండ్‌ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్‌ ప్రస్తావించింది. 2022 టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించారు. నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్‌ చేశారు. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు భోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ డెయిరీపై అనర్హత వేటు వేసేలా చిన్నఅప్పన్న కుట్రకు తెరలేపారు. డెయిరీని తనిఖీ చేయాలంటూ తితిదే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. డెయిరీపై అనర్హతవేటు వేసేలా అజ్ఞాతవ్యక్తులతో పిటిషన్లు వేయించారు. చిన్నఅప్పన్న కుట్రతో బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను తితిదే నిలిపివేసింది. ఆ స్థానంలో ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థ ప్రవేశించి.. రూ.138 ఎక్కువ కోట్‌ చేసింది. పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకుంది. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చింది.
 
కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు
 
ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత విడిచిపెట్టారని జనార్ధన్ రావు అధికారులకు తెలిపారు. జోగి రమేష్ సూచనల మేరకే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని వివరించారు.
 
అయితే, జోగి రమేష్ మాత్రం తనకు జనార్ధన రావు అనే వ్యక్తి తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. జనార్ధన రావును తానెప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అయితే జనార్ధనరావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జనార్ధన్ రావు స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రికార్డింగ్‌ తోపాటు లిఖిత పూర్వకంగా ఎక్సైజ్, సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు.
The post TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులుPawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు

    అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ… విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల కృషితో

APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

    మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ