hyderabadupdates.com Gallery Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య ! post thumbnail image

Uttar Pradesh : సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారానికి నిర్వహించే ‘సమాధాన్‌ దివస్‌’ (ప్రజా ఫిర్యాదుల దినం)లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అర్జీ చూసి యూపీలోని (Uttar Pradesh) సీతాపుర్‌ కలెక్టర్‌ నివ్వెరపోయారు. తన భార్య నసీమున్‌ రాత్రిపూట నాగినిగా మారిపోయి బుస కొడుతోందని, బెదిరిస్తోందని మహమూదాబాద్‌ తహసీల్‌లోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో సహాయం కోసం కలెక్టర్‌ వరకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీనితో ఈ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.
Uttar Pradesh Viral Updates
‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్‌.. స్‌. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్‌ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్‌ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్‌… స్‌… అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్‌ బావురు మన్నాడు. పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు. అతను చెప్పింది విన్న కలెక్టర్‌ మొదట అవాక్కయినా… తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్‌ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు.
Also Read : Anakapalli SP: జగన్‌ మాకవరపాలెం పర్యటనకు ఓకే ! రోడ్ షోకు నో పర్మిషన్ !
The post Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్

చెన్నై : త‌మిళ‌నాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ పై కామెంట్స్ చేసేందుకు త‌న‌కు ఎలాంటి అధికారం లేద‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియదని, తాను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు