Uttarakhand : శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్ (Uttarakhand) అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్ నుంచి కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది వేల మంది భక్తుల నినాదాల మధ్య ఘనంగా ప్రారంభమయింది. ఈ ఊరేగింపు శనివారం నాటికి ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయానికి చేరుకోనుంది. మిగిలిన ఆరునెలల పాటు ఆ ఆలయంలో కేదార్‌నాథుడు పూజలందుకుంటాడు. ఈ ఉత్సవాల్లో ఉత్తరాఖండ్ (Uttarakhand) సీఎం పుష్కర్‌సింగ్ ధామీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలను అధికారులు మూసివేయగా, బద్రీనాథ్ ఆలయాన్ని నవంబరు 25న మూసివేయనున్నారు. మంచు, తీవ్రమైన చలి కారణంగా ప్రతి సంవత్సరం అక్టోబరు- నవంబరు నెలల్లో ఈ ఆలయాలను మూసివేసి ఏప్రిల్- మే నెలల్లో తిరిగి తెరుస్తారు.
Uttarakhand – ఒకే గుడిలో రెండు రూపాల్లో కృష్ణుడి దర్శనం
రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో 500 ఏళ్ల క్రితం నాగ సాధువులు నిర్మించిన బ్రజ్‌లౌతా ఆలయంలోని రెండు శ్రీకృష్ణుడి విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ గుడిలోని ఓ విగ్రహం కన్నయ్య వేణువు పట్టుకున్న రూపంలో ఉంటుంది. కర్ర చేత పట్టుకున్నట్లు మరో ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ఆలయ చరిత్ర శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన లీలతో ముడిపడి ఉంది. ‘‘ఇంద్రుడికి గర్వ భంగం చేయడానికి శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరి కింద బ్రజ్ ప్రజలు ఏడు రోజులు సురక్షితంగా ఉన్నారు. ఇంద్రుడికి కోపం తగ్గిన తర్వాత కృష్ణుడు కర్ర పట్టుకుని ప్రజలకు కనిపించాడు. దీంతో అప్పటి నుంచి బ్రజ్ ప్రజలు కన్నయ్యను రెండు రూపాల్లో పూజించడం ప్రారంభించారు’’ అని చెబుతారు. ఈ గుడిలో ఉన్న ఒక కృష్ణుడి రూపం ప్రజలను రక్షించేదిగా, మరొక రూపం ఆనందాన్ని ప్రసాదించేదిగా భక్తులు భావిస్తారు.
Also Read : CJI: కొత్త సీజేఐ ఎంపిక ప్రక్రియ ప్రారంభం
The post Uttarakhand: కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Uttarakhand: కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత
Categories: