hyderabadupdates.com Gallery Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క post thumbnail image

 
 
వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్‌ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం లేకపోవడంతో మొక్కలనే బిడ్డలుగా భావించిన తిమ్మక్క… దశలవారీగా కుదూరు నుంచి హులికల్‌ వరకు 4.5 కి.మీ. పొడవునా 385 మర్రి మొక్కలను నాటారు. అవి భారీ వృక్షాలుగా ఎదిగాయి. దీంతో పాటు తమ గ్రామంలో వృక్ష ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆమె రాష్ట్రంలో 8 వేలకు పైగా మొక్కలు మహావృక్షాలుగా ఎదిగేందుకు శ్రమించారు.
వరుసగా (సాలు) చెట్లు (మర) పెంచుతూ వచ్చిన ఆమె… సాలుమరద తిమ్మక్కగా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ సహా కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం, కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ తో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రభుత్వం ఆమెను పర్యావరణ రాయబారిగా (2022) నియమించి, మంత్రివర్గ హోదాను కేటాయించింది. అమెరికాలోనూ ఆమె పేరిట అధ్యయన సంస్థలున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పర్యావరణశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తదితరులు తిమ్మక్క భౌతికకాయానికి నివాళి అర్పించారు. మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ తదితరులు తిమ్మక్క మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
 
తిమ్మక్క మృతి పట్ల పవన్‌ కళ్యాణ్ సంతాపం
 
వృక్షమాతగా గుర్తింపు పొందిన సాలుమరద తిమ్మక్క మృతిపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘కొందరు ఓ వైపు చెట్లను నరికి పర్యావరణానికి హాని చేస్తుంటే తిమ్మక్క లాంటి వాళ్లు పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకొన్నారు’’ అని కొనియాడారు.
The post Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీElection Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ

Election Commission : తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్‌ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు

భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్

కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టును అభినందించారు. ఇదే స‌మ‌యంలో త‌మ కేర‌ళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్

Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

    ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్‌ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్