hyderabadupdates.com Gallery Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం post thumbnail image

 
 
పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం వేసిన పందిరిలో తండ్రి మృతదేహం ఉంచిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
సగెంకుర్దు గ్రామానికి చెందిన అనంతప్ప కూతురు అవంతికకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈ రోజు (ఆదివారం) అవంతిక పెళ్లి జరగాల్సి ఉంది. నిన్నటి నుంచి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి కోసం ఇంటి దగ్గర పందిరి కూడా వేశారు. ఈ క్రమంలో అనంతప్ప పెళ్లి కోసం సరుకులు కొనుగోలు చేయడానికి మండల కేంద్రానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అనంతప్ప బైకు మీద నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం అయింది. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతప్ప తుది శ్వాస విడిచాడు.
కూతురి పెళ్లి కోసం వేసిన టెంట్‌లోనే అనంతప్ప మృతదేహాన్ని ఉంచారు. ఆ దృశ్యాలను చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టుకున్నారు. ఇక, అనంతప్ప కుటుంబసభ్యుల పరిస్థితి వర్ణణాతీతం. గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
The post Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

NIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసుNIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసు

  దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ‘ఎన్‌ఐఏ’ ఉగ్రవాద సంబంధిత కేసులను

Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షంDonald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

Donald Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్‌… దక్షిణకొరియా వేదికగా ట్రంప్ (Donald Trump)… మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.