hyderabadupdates.com Gallery Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య post thumbnail image

 
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఒక ప్లాన్‌ ప్రకారం భర్త అడ్డు తొలగించుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక యువకుని మృతదేహం అతను ఉంటున్న గ్రామం వెలుపలి పొలంలో పోలీసులకు కనిపించింది. మృతదేహంపై మూడు బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత దీనిని దోపిడీ కోసం చేసిన హత్యగా భావించారు. అయితే తదుపరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు అగ్వాన్‌పూర్ గ్రామంలో ఉంటున్న మృతుడి భార్య అంజలి విచారించేందుకు ఉపక్రమించగా, ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అంజలికి అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు కనుగొన్నారు.
దీంతో పోలీసులు అజయ్‌ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతను కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఈ జంట అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరువాత పోలీసులు వారికోసం వెదుకులాట సాగించి, ఎట్టకేలకు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ సమయంలో అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్ తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్‌ చేసిందని అతను చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అజయ్ స్వయంగా రాహుల్‌ను పొలాల దగ్గర కలుసుకుందామని చెప్పాడు. అతను రాగానే అతనిపై రాహుల్‌ మూడుసార్లు తుపాకీ కాల్పులు జరిపాడని దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
The post Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

    పార్టీకి కార్యకర్తే అధినేత అని… ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. తెదేపా కేంద్ర

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దంవ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

ముంబై : కోట్లాది మంది భార‌తీయులు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భార‌త్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంస‌న్ పై

TTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వంTTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

TTD : దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ (TTD) ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను