hyderabadupdates.com Gallery Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య post thumbnail image

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బెళగావి జిల్లా రాయభాగ తాలూకా కప్పలగుడ్డిలో బుధవారం జరిగిన కనకదాస విగ్రహావిష్కణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యతీంద్ర మాట్లాడుతూ… ‘మా నాన్న రాజకీయంగా చరమాంకంలో ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు సీనియర్‌ మంత్రి సతీశ్‌ జార్ఖిహొళికి ఉన్నాయి. మా తండ్రిలా పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నిబద్ధతను పాటించే అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం’ అని వ్యాఖ్యానించారు.
Yatindra Siddaramaiah Key Comments
అయితే, యతీంద్ర కొంతసేపటికే యూటర్న్‌ తీసుకున్నారు. నాయకత్వ మార్పు ఊహాగానమే అంటూ కొట్టిపారేశారు. ఈ విషయంలో తమ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని రాయచూరులో పర్యటించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను విలేకరులు అడగ్గా ‘ఈ ప్రశ్న యతీంద్రకే వేయాలి’ అని బదులిచ్చారు.
Also Read : Karpuri Thakur: బిహార్ ఎన్నికల బరిలో భారతరత్న మనవరాలు
The post Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎంజిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

విశాఖ‌పట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. త‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వ‌చ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన