hyderabadupdates.com Gallery YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన post thumbnail image

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈనెల 4 మంగళవారం నాడు మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. తుపాను కారణంగా తీవ్రంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావంగా ఈ పర్యటన చేస్తున్నారు. పెడన, మచిలీపట్నంలో రైతులను ఆయన పరామర్శిస్తారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలను కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు.
YS Jagan Tour for Montha Cyclone Efected Region
ఇటీవల మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, గాలులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన, రైతుకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు, పథకాలను రద్దు చేశారు. ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలను చేకూర్చారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడచిన 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు. దాదాపు రూ.600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టారు. ఆర్బీకేలను, ఈ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు.
ఇవన్నీ కూడా రైతులకు పెనుశాపంగా మారిన నేపథ్యంలో తాజాగా వచ్చిన మోంథా తుపాను కూడా రైతుల నడ్డి విరిచింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గానీ, కార్యాచరణ గానీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా, సంఘీభావంగా శ్రీ వైయస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించనున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి తద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు పేర్ని నాని, తలశిల రఘురాం వెల్లడించారు.
Also Read : ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్
The post YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిలYS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిల

  బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు.