hyderabadupdates.com Gallery YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ post thumbnail image

 
 
కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు రావాల్సిన నీటి వాటాలను సాధించాలని ఆయన కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన తొమ్మిది పేజీల లేఖలో పలు అంశాలను జగన్ ప్రస్తావించారు.
చంద్రబాబుకు రాసిన లేఖలో జగన్‌ ఏమన్నారంటే ?
‘ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలి. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలి
రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసింది.
ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి’ అని సూచించారు.
The post YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అమ‌రావ‌తిపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేదుఅమ‌రావ‌తిపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేదు

అమ‌రావ‌తి : అమ‌రావ‌తిపై మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని

India – Afghanistan: కాబుల్‌ లో భారత రాయబార కార్యాలయంIndia – Afghanistan: కాబుల్‌ లో భారత రాయబార కార్యాలయం

India : పాక్‌తో ఘర్షణ వేళ అఫ్గానిస్థాన్‌తో భారత్ సంబంధాలను పునరుద్ధరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన

MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దుMLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

  బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్‌ దేబాంగ్సు