hyderabadupdates.com Gallery YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన post thumbnail image

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈనెల 4 మంగళవారం నాడు మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. తుపాను కారణంగా తీవ్రంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావంగా ఈ పర్యటన చేస్తున్నారు. పెడన, మచిలీపట్నంలో రైతులను ఆయన పరామర్శిస్తారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలను కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు.
YS Jagan Tour for Montha Cyclone Efected Region
ఇటీవల మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, గాలులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన, రైతుకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు, పథకాలను రద్దు చేశారు. ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలను చేకూర్చారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడచిన 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు. దాదాపు రూ.600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టారు. ఆర్బీకేలను, ఈ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు.
ఇవన్నీ కూడా రైతులకు పెనుశాపంగా మారిన నేపథ్యంలో తాజాగా వచ్చిన మోంథా తుపాను కూడా రైతుల నడ్డి విరిచింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గానీ, కార్యాచరణ గానీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా, సంఘీభావంగా శ్రీ వైయస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించనున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి తద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు పేర్ని నాని, తలశిల రఘురాం వెల్లడించారు.
Also Read : ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్
The post YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌

KTR : గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ… ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందిTG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

    తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు