hyderabadupdates.com Gallery YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు post thumbnail image

 
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.
 
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
అంబరాన్ని అంటుతున్న దీపావళి సంబరాలు
 
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీపావళి వేళ లక్ష్మీదేవికి పూజ చేసిన హిందూ సోదరులు సోమవారం సాయంత్రం నుంచీ టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో టపాసుల మోత మోగిపోతోంది. రెండ్రుజులుగా బాణసంచా దుకాణాలు కిక్కిరిపోతున్నాయి. ఖర్చు ఎంతైనా తగ్గకుండా భారీగా టపాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దేశంలోని వీధులన్నీ చిన్నాపెద్ద అని తేడా లేకుండా నిండిపోయాయి. అందరూ తమ ఇళ్ల ముందు భారీగా బాణసంచా పేలుస్తూ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. కాగా, తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
The post YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రోయా నువ్వే నా సంగీతం నా స‌ర్వ‌స్వంరోయా నువ్వే నా సంగీతం నా స‌ర్వ‌స్వం

పాకిస్తాన్ :ప్ర‌ముఖ పాకిస్తాన్ సింగ‌ర్ అద్నాన్ స‌మీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా గురువారం స్పందించాడు. పదహారు సంవత్సరాల క్రితం నా ప్రియమైన రోయా నాకు ‘అవును’ అని చెప్పింది. ఆ క్షణం నుండే నా జీవితం

Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్

    టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్‌ బాలాజీనే కారణమని ఆరోపించారు. పథకం ప్రకారం