అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. మరోవైపు వైసీపీ నేత పేర్ని నాని, మరో ముగ్గురు నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేట్ వద్దే నిలుచున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట ఆయనతో ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగన్ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం.. ఇటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వాళ్లకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. భారీ ర్యాలీగా నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు.
ఇటీవల కోర్టు అనుమతితో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. జగన్ రాక నేపథ్యంతో హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకుని… న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు. ‘‘హాజరును కోర్టు రికార్డు చేసింది. ప్రస్తుతానికైతే ఆయన మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు’’ అని జగన్ తరఫు లాయర్ మీడియాకు తెలిపారు. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్‌పాండ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఆపై పర్యటన ముగించుకుని తిరుగు పయనం అయ్యారు.
అక్రమ ఆస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు.
The post YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !
Categories: