hyderabadupdates.com movies అంతు చిక్కని ప్రభాస్ ఆలోచనలు

అంతు చిక్కని ప్రభాస్ ఆలోచనలు

టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ గ్యారెంటీ మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ఏకకాలంలో మూడు సినిమాలు సెట్స్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. ఫౌజీ బ్యాలన్స్ ఉండగానే స్పిరిట్ మొదలైపోయింది. దీని గురించి మాట్లాడుతుండగానే కల్కి 2ని స్టార్ట్ చేశారు. ఇదంతా ఊహకందని వేగం.

జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ తో ప్రశాంత్ నీల్ బిజీ ఉన్నప్పటికీ ఈ ఏడాదిలోనే సలార్ 2 శౌర్యంగపర్వం మొదలైపోతుందని ఇన్ సైడ్ టాక్. రాజా సాబ్ వైఫల్యాన్ని ప్రభాస్ లైట్ తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఊరట దక్కేందుకు నిర్మాత విశ్వప్రసాద్ కు మరో మూవీ హామీ ఇచ్చాడు. తనను కలుస్తున్న దర్శకులను నో అనకుండా కథలు వింటున్నాడు. ఇప్పుడీ డిస్కషన్ కు కారణం ఒక ఫోటో.

మలయాళంలో కల్ట్ కంటెంట్ గా చెప్పుకునే ఎకో, కిష్కిందకాండం దర్శకుడు దింజిత్ అయ్యతన్ ఇటీవలే ప్రభాస్ ని కలుసుకున్నాడు. ఏదైనా స్టోరీ చెప్పడానికేమోనని అభిమానులు అనుమాన పడుతున్నారు. ఇతను ఇటీవలే ధనుష్ ని కూడా కలిశాడు. ఒకవేళ నిజంగా డార్లింగ్ కాంబోలో మూవీ ఏదైనా ప్లానింగ్ ఉందేమోనని ఫ్యాన్స్ కి సందేహం కలుగుతోంది. అలాని ఎగ్జైట్ మెంట్ కూడా లేదు.

ఎందుకంటే మల్లువుడ్ దర్శకుల శైలి మన కమర్షియల్ ఫార్ములాకు సూట్ అవ్వదు. వాళ్ళ స్లో నెరేషన్, డిటైలింగ్ మన ఆడియన్స్ ఓటిటిలో చూస్తారు తప్పించి థియేటర్లలో భరించలేరు. అందుకే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి ఒకటి రెండు తప్ప మిగిలిన మలయాళ సినిమాలేవీ తెలుగులో థియేటర్ డబ్బింగ్ కాలేదు. అలాంటప్పుడు ప్రభాస్ కు ఈ జానర్లు, బ్యాక్ డ్రాప్ లు అంతగా సెట్ కావు.

ప్రస్తుతానికి జరిగింది కేవలం కలయిక కాబట్టి ఆ ఫోటోని బట్టి కంక్లూజన్ కు రాలేం కానీ ప్రభాస్ కు కనక సదరు డైరెక్టర్ల శైలి, స్టోరీ నచ్చితే ఓకే చెప్పేందుకు వెనుకాడడు. అదే ఫ్యాన్స్ ని టెన్షన్ కు గురి చేస్తోంది. మొత్తానికి స్పీడ్ తగ్గించకుండా వరసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న ప్రభాస్ డైరీ ఇంకో మూడు సంవత్సరాల దాకా చాలా బిజీగా ఉంది. ఈలోగా ఏమేం కాంబోలు కుదురుతాయో చూడాలి.

Related Post

`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. అమెరికా సైనిక స్థావ‌రాలు ఉన్న గల్ఫ్ దేశాల‌పై విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి నెత‌న్యాహూ నివాసంపైనా ఇరాన్

‘ఆధార్’ పై UK ప్రధాని కన్ను.. కాపీ కొట్టే ప్లాన్!‘ఆధార్’ పై UK ప్రధాని కన్ను.. కాపీ కొట్టే ప్లాన్!

బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు ఇండియాకు చెందిన ఆధార్ మోడల్ పెద్ద చర్చకు దారితీస్తోంది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇటీవలి ఇండియా పర్యటనలో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీని వెనుక ఉన్న అసలు కారణం

పరుగులు మొదలెట్టండి రాజా సాబ్పరుగులు మొదలెట్టండి రాజా సాబ్

2025 టాలీవుడ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ రాజా సాబ్ విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలకు రెడీ అవుతున్నారు. అంతకు ముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక అంచనాల మీటర్ పైకి