hyderabadupdates.com movies అఖండ-2లో శివుడు ఎవరు?

అఖండ-2లో శివుడు ఎవరు?

‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు ఓపెనింగ్స్‌పై ఆ ప్రభావం ఏమీ కనిపించలేదు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ.60 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒరిజినల్ ఫిగర్స్ అంత ఉండకపోవచ్చు కానీ.. బాలయ్య కెరీర్లో ఇది హైయెస్ట్ డే-1 గ్రాసర్ అనడంలో సందేహం లేదు. వీకెండ్ వరకు సినిమా నిలకడగానే వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.

ఈ సినిమాలో కొందరికి కొన్ని సీన్లు నచ్చాయి. కొందరికి నచ్చలేదు. కానీ అందరూ ఏకగ్రీవంగా పాజిటివ్‌గా స్పందించిన ఎపిసోడ్ ఒకటి ఉంది. అదే.. అఖండ తల్లి చనిపోతే తన బదులు స్వయంగా శివుడే వచ్చి అంత్యక్రియలు నిర్వహించే సీన్. సినిమాలో ఇది సర్ప్రైజ్ సీన్ అని చెప్పొచ్చు. ఆ సన్నివేశం అందరినీ కదిలిస్తుంది. ఆ సీన్లో శివుడి పాత్రలో నటించిన ఆర్టిస్టు కూడా బాగా చేశాడు. శివుడి పాత్రకు అతను బాగా సెట్టయ్యాడు. క్లైమాక్స్‌లోనూ మరోసారి శివుడు కనిపిస్తాడు.

ఇంతకీ ఈ పాత్ర చేసింది ఎవరు అన్నది ఆసక్తికరం. ‘అఖండ-2’కు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకు చాలామంది ఉత్తరాది నటులతో కీలక పాత్రలు చేయించారు. శివుడి పాత్ర చేసింది కూడా హిందీ నటుడే. తన పేరు.. తరుణ్ ఖన్నా. అతను హిందీ సీనియళ్లలో బాగా ఫేమస్. 2015లో వచ్చిన ‘సంతోషి మా’ సీరియల్లో అతను మహా శివుడి పాత్రనే చేయడం విశేషం. ఇంకా పలు సీరియళ్లలో అతను శివుడి వేషమే వేశాడు. ‘అఖండ-2’లో శివుడి పాత్రకు కూడా అతనే పర్ఫెక్ట్ అని బోయపాటి తరుణ్‌ను తీసుకొచ్చాడు. అతనా పాత్రకు బాగానే న్యాయం చేశాడని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.

Related Post

ఒకవేళ కవిత సీఎం అయితే?ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆమె స‌మాధానం చెప్పారు. ఒక‌రు స్పందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? అని అడ‌గ్గా.. త‌ప్ప‌కుండా

విజయ్ వీడ్కోలు… ప్లానింగ్ గట్టిగానేవిజయ్ వీడ్కోలు… ప్లానింగ్ గట్టిగానే

తమిళంలో ఓ మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని నంబర్ వన్ హీరోగా కొనసాగాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడును దాటి విస్తరించిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను ఎవ్వరూ అందుకునే పరిస్థితి కనిపించలేదు. సినిమాల్లో కొనసాగినంత కాలం రజినీనే నంబర్ వన్