hyderabadupdates.com movies అటకెక్కిన షారుఖ్, సల్మాన్ సినిమా?

అటకెక్కిన షారుఖ్, సల్మాన్ సినిమా?

స్పై సినిమాల మీద ఒక యూనివ‌ర్శ్‌నే క్రియేట్ చేసి.. భారీ విజ‌యాలు అందుకుంది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్. ఏక్ థా టైగ‌ర్, టైగ‌ర్ జిందా హై, టైగ‌ర్‌-3, ప‌ఠాన్, వార్, వార్‌-2.. ఈ యూనివ‌ర్శ్‌లో భాగంగా వ‌చ్చిన సినిమాలే. ఐతే ఒక ద‌శ వ‌ర‌కు ఈ యూనివ‌ర్శ్ సినిమాలు ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చాయి కానీ.. గ‌త కొన్నేళ్ల నుంచి ఈ ఫార్ములా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు.

టైగ‌ర్-3తో తొలి షాక్ తిన్న య‌శ్ రాజ్ ఫిలిమ్స్… గ‌త ఏడాది వార్-2 రూపంలో ఇంకో గ‌ట్టి ఎదురు దెబ్బను తీసుకుంది. ఒక మూస‌లో సాగిపోతున్న య‌శ్ రాజ్ స్పై యూనివ‌ర్శ్ ప్రేక్ష‌కుల‌కు మొహం మొత్తేస్తోంద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. దీంతో ఈ యూనివ‌ర్శ్‌లో భాగంగా ఆల్రెడీ ప్లానింగ్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్క‌టిగా డ్రాప్ చేసేస్తోంది య‌శ్ రాజ్ సంస్థ‌.

వార్-3, ప‌ఠాన్-2, టైగ‌ర్-4 చిత్రాలు రావ‌ని ఇప్ప‌టికే అర్థ‌మైపోయింది. ఇవి కాకుండా టైగ‌ర్ వెర్స‌స్ ప‌ఠాన్ అంటూ ఒక మ‌ల్టీవ‌ర్స్ మూవీ చేయాల‌ని య‌శ్ రాజ్ వాళ్లు గ‌తంలో ప్ర‌ణాళిక ర‌చించారు.

షారుఖ్ హీరోగా చేసిన‌ ప‌ఠాన్ సినిమాలో టైగ‌ర్ పాత్రలో స‌ల్మాన్ ఖాన్ క్యామియో పెడితే అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాకు ఆ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. అది చూసి.. ప‌ఠాన్, టైగ‌ర్ పాత్ర‌ల‌తో ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని య‌శ్ రాజ్ సంస్థ భావించింది. సిద్దార్థ్ ఆనంద్ లేదా అయాన్ ముఖ‌ర్జీతో ఈ సినిమా తీయించాల‌నుకున్నారు. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ రైటింగ్ టీం దీని మీద ప‌ని చేసింది కూడా.

కానీ వార్-2 రిజ‌ల్ట్ చూశాక అస‌లీ స్పై యూనివ‌ర్శ్ మ‌నుగ‌డే ప్ర‌మాదంలో ప‌డ‌డంతో టైగ‌ర్ వెర్సస్ ప‌ఠాన్ సినిమా మీద ఆశ‌లు వ‌దులుకున్నార‌ట‌. స‌ల్మాన్ మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోవ‌డంతో ఇప్పుడీ సినిమా తీసి ఆయ‌న‌తో పాటు షారుఖ్‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌బోద‌ని య‌శ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆద‌త్య చోప్రా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. బాలీవుడ్ మీడియా కూడా ఈ మేర‌కు వార్త‌లు ఇస్తోంది. టైగ‌ర్ వెర్సస్ ప‌ఠాన్ మాత్ర‌మే కాదు.. వైఆర్ఎఫ్ స్పై యూనివ‌ర్శ్ నుంచి ఇక‌పై ఏ సినిమా రాక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

Image – YRF

Related Post

సంక్రాంతిని మించిన సునామి వచ్చేస్తుందిసంక్రాంతిని మించిన సునామి వచ్చేస్తుంది

ఇప్పుడేదో సంక్రాంతి సినిమాల హడావిడి చూసి ఇంతకన్నా పెద్ద క్లాష్ ఉండదనుకుంటున్నాం కానీ మార్చిలో అసలైన ఫైట్ చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే పొంగల్ కు జరిగింది గొప్పగా చెప్పుకునే కాంపిటీషన్ కాదు. బడ్జెట్ పరంగా రాజా సాబ్ డామినేషన్ ఎక్కువగా ఉంటే,

హఠాత్తుగా ఊడిపడుతున్న ఉపేంద్రహఠాత్తుగా ఊడిపడుతున్న ఉపేంద్ర

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మసకబారుతోంది. పదే పదే వరసగా పాత సినిమాలను థియేటర్లకు తీసుకొస్తుండటంతో జనాలకు మొహం మొత్తుతోంది. పైగా రూపాయి తగ్గించకుండా ఇప్పుడున్న రేట్లకే బాదుతుండటంతో ప్రేక్షకుల నుంచి స్పందన కరువుతోంది. ఆ మధ్య స్టాలిన్, యమదొంగ,

Tentative runtime of Pawan Kalyan’s Ustaad Bhagat Singh revealedTentative runtime of Pawan Kalyan’s Ustaad Bhagat Singh revealed

Powerstar Pawan Kalyan has reunited with Harish Shankar for the action drama Ustaad Bhagat Singh. The actor-director duo’s first film, Gabbar Singh, was a sensational blockbuster, and hence expectations are