అమరావతి : అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు. ఈ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి ప్లస్ 3 అంతస్తులతో అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తున్నారు. అదే విధంగా జి ప్లస్ 8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్,జి ప్లస్ 3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్ మరియు గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు.120 మంది బ్యాచ్ ఆఫ్ ట్రైనీ జడ్జిలకు సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు. ఏపీ హైకోర్టు నుండి ఈజుడీషియల్ అకాడమి 5.7 కి.మీల దూరంలో 50 మీటర్ల వెడల్పు కలిగిన మంచి రహదారి సౌకర్యం కలిగి ఉంది.
బ్లాక్ ఎ జి ప్లస్ 3 అంతస్తులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ బ్లాక్ 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియంతో కూడిన స్టేజ్ , ఫ్రీ ఫంక్షన్ ఏరియ,120 సీట్లతో కూడిన సెమినార్ హాల్,70 సీట్లతో కూడిన 2 క్లాస్ రూమ్ లు,70 సీట్లతో మూట్ కోర్ఠు హాల్,60 సీట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ కలిగి ఉంటుంది. అంతేగాక 50 సీట్లతో కంప్యూటర్ ల్యాబ్,48 సీట్లతో లైబ్రరీ , రీడింగ్ రూమ్, డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, జడ్జిల లాంజ్,ఫ్యాకల్టి రూమ్ , కొలాబరేషన్ స్పేస్స్,హెల్తు యూనిట్ , క్రెచే సౌకర్యం,3 మీటర్ల వెడల్పు కలిగిన కారిడార్స్, సెంట్రల్ లిఫ్టు వంటి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటుంది.
బ్లాక్-బి జిప్లస్ 3 అంతస్తులతో కూడిన ఈ భవనంలో రెసిడెన్షియల్ ,ఎమినీటీస్ సౌకర్యాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా 108 సీట్లతో డైనింగ్ హాల్,10 సీట్ల విఐపి డైనింగ్ హాల్, పూర్తి స్థాయి సౌకర్యాలతో కూడిన కిచెన్ , సర్వీస్ ఏరియా జిమ్,2 బ్యాడ్మింటన్ కోర్టు హాళ్ళు, స్క్వాష్ కోర్టు,టేబుల్ టెన్నిస్ హాల్, యోగా , మెడిటేషన్ కు ప్రత్యేకంగా మల్టీ పర్పస్ హాల్ కలిగి ఉంటుంది. బ్లాక్ బి 2 జి ప్లస్ 8 అంతస్తులతో కూడిన భవనంలో జ్యుడీషియల్ అధికారులు, ట్రైనీలకు రెసిడెన్షియల్ ఎకామిడేషన్, 98 సీట్లతో టిఫికల్ హాస్టల్ యూనిట్, 5 సూట్ రూమ్ లు,ప్రతి అంతస్తులో లాంజ్ స్పేస్,ప్యాంట్రీ , యుటిలిటీ సౌకర్యాలు కల్పించబడి ఉంటాయి.
బ్లాక్ బి 3 జి ప్లస్ 1 అంతస్తులతో కూడిన భవనంలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్, సపోర్టింగ్ స్టాఫ్ వసతి సౌకర్యాలు ఉంటాయి. పార్కింగ్ ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి బేస్మెంట్ పార్కింగ్,రెండు జోన్లలో ద్విచక్ర వాహనాల పార్కింగ్, సైక్లింగ్ , వాకింగ్ ట్రాక్ ఉంటాయి.డ్రైవర్స్ డార్మిటరి, రెండు సర్వీస్ క్వార్టర్స్ ఉంటాయి.
The post అత్యాధునిక సౌకర్యాలతో జుడీషియల్ అకాడమీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
అత్యాధునిక సౌకర్యాలతో జుడీషియల్ అకాడమీ
Categories: