hyderabadupdates.com movies అధికారం వచ్చి ఎన్ని నెలలు అయినా ప్రజల మధ్యే సీఎం

అధికారం వచ్చి ఎన్ని నెలలు అయినా ప్రజల మధ్యే సీఎం

అధికారంలోకి రాక‌ముందు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వ‌చ్చిన త‌ర్వాత కూడా నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను అంటిపెట్టుకుని ఉంటున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది టీడీపీనే అని చెప్పారు. గత 17 మాసాల్లో ప్ర‌తి నెలా ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూనే ఉన్నారు సీఎం చంద్ర‌బాబు అంతేకాదు.. ఏదో ఒక కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతూనే ఉన్నారు. తాజాగా.. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతన్న మీకోసం కార్యక్రమం ముగిసింది.

వాస్తవానికి ఈ 17 మాసాల్లో చంద్రబాబు కీలకమైన అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యక్రమం కూడా ప్రజల వద్దకు వెళ్లేదే. ప్రజలను కలుసుకోవడంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలా అనేక అంశాలను ప్రజలకు వివరించే అవకాశం ఉన్న కార్యక్రమాలు కావడం విశేషం. వీటిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్, సూపర్ సిక్స్ సూపర్ హిట్, అదే విధంగా స్త్రీ శక్తి… ఇలా అనేక కార్యక్రమాలు సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో అమలు చేశారు.

ఈ ప్రతి కార్యక్రమం లక్ష్యం నాయకులు ప్రజలను కలుసుకోవడం వారి సమస్యలు తెలుసుకోవడం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించడం ద్వారా ప్రభుత్వం పై పాజిటివిటీని పెంచాలి అన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. అయితే ఈ విషయంలో ఎంతమంది పాల్గొంటున్నారు ఎంతమంది వెనకంజ వేస్తున్నారు అనే అంశాలపై కూడా పక్కా లెక్కలు తీస్తున్నారు. ఇది ఇట్లా ఉంటే తాజాగా రైతన్న మీకోసం కార్యక్రమం ఇటీవల చేపట్టారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతకు పెద్దపేట వేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామంలోనూ రైతులను చేరుకొని వారి ఇంటికి వెళ్లి వారికి అధునాత‌న‌ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతోపాటు సాగులో సాంకేతికతను ఏ విధంగా వినియోగించాలి డ్రోన్ వ్యవస్థను ఎలా అందుకొచ్చుకోవాలి అనే పలు అంశాలపై శిక్షణ ఇవ్వాలి. ఇదీ రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అయితే దీనిలో కనీసం 30% మంది ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేయలేదన్నది తాజాగా ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి అందిన కీలక సమాచారం. ఎమ్మెల్యేల పార్టిసిపేషన్ అయితే అక్కడ కనిపించలేదు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే విష‌యంలో ఆయ‌న మ‌రోసారి దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

Related Post

రజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడురజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయడం కంటే గొప్ప అవకాశం ఏముంటుంది. అందులోనూ కమల్ హాసన్ నిర్మాతగా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కొద్దిరోజుల క్రితం సుందర్ సి దర్శకత్వంలో ఈ కాంబో నుంచి ఒక ప్యాన్ ఇండియా మూవీ

దక్షిణాది మార్కెట్ కోసం నెట్ ఫ్లిక్స్ స్ట్రాటజీదక్షిణాది మార్కెట్ కోసం నెట్ ఫ్లిక్స్ స్ట్రాటజీ

రెండేళ్ల క్రితం వరకు నెట్ ఫ్లిక్స్ అంటే కేవలం ఫారిన్ కంటెంట్ చూసే ఒక ఖరీదైన ప్లాట్ ఫార్మ్ గా మాత్రమే భారతీయులకు పరిచయం. నిజంగానే దాని సరుకు అలాగే ఉండేది. కానీ అలా పరిమితులు పెట్టుకోవడం వల్ల ఇండియన్ మార్కెట్