hyderabadupdates.com movies అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించబోయే ఈ ఈవెంట్ సితార సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. ఆన్ లైన్లో పెట్టిన రోజుల వ్యవధిలోనే టికెట్లు అన్నీ అమ్ముడుపోవడం చూస్తుంటే అనిరుద్ మీద మన వాళ్లకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాని టికెట్ రేట్లు వందల్లో లేవు. ఏకంగా వేల రూపాయలు పెట్టేశారు. ఏడెనిమిది వేల రూపాయల టికెట్లు సైతం దొరకలేదంటే ఏ స్థాయి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల ముందుగానే ఇంత హైప్ రావడం అనూహ్యం.

ఇంతగా రెస్పాన్స్ రావడానికి కారణాలు లేకపోలేదు. అనిరుద్ కు ఇక్కడ చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. రఘువరన్ బిటెక్ నుంచి మొదలుపెట్టి దేవర దాకా ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ మన సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార బ్యానర్ నిర్మించిన మేజిక్ కి పని చేసింది అనిరుధే.

షూటింగ్ అయిపోయింది కానీ ఆడియో లాంచ్ అదే వేదిక మీద జరగనుంది. ఇది కాకుండా నాని ది ప్యారడైజ్ మీద ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. మొదటి ఆడియో సింగల్ వచ్చే వారం రానుండగా అనిరుధ్ ఈవెంట్ లో మరో సాంగ్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇవే కాదు ఇప్పటిదాకా అనిరుధ్ సంగీతం సమకూర్చిన ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ని ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ జనాలు ఎదురు చూస్తున్నారు. దీనికి లైవ్ టెలికాస్ట్ ఉండదు. కొంత గ్యాప్ తర్వాత ఏదైనా శాటిలైట్ లేదా ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తారు తప్పించి ఇంట్లో కూర్చుని అదే రోజు చూసే వీలు ఉండదు.

చేతిలో ఏడెనిమిది సినిమాలతో బిజీగా ఉన్న అనిరుద్ తెలుగు ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. అంత పెద్ద గచ్చిబౌలి స్టేడియం సరిపోలేదంటే ఈ మేనియాని వర్ణించడానికి పీక్స్ అనే పదం సరిపోదేమో. ఈవెంట్ రోజు ఇంకేమేం సర్ప్రైజులు ఉంటాయో చూడాలి.

Related Post

ఏపీలో కొత్త జిల్లాలు: అడిగినా.. అడగ‌కున్నా తంటానే!ఏపీలో కొత్త జిల్లాలు: అడిగినా.. అడగ‌కున్నా తంటానే!

ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌, మండ‌లాల స‌రిహ‌ద్దుల నిర్ణ‌యం అంశం ఎటూ తేల‌డం లేదు. గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు.. తాము అధికారంలోకి రాగానే.. ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కుకొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, మండ‌లాల స‌రిహ‌ద్దుల‌ను మారుస్తామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. కొత్త జిల్లాల‌ను కూడా

ర‌ఘురామ‌పై రాళ్ల దాడి… ఏం జ‌రిగింది?ర‌ఘురామ‌పై రాళ్ల దాడి… ఏం జ‌రిగింది?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తృటిలో త‌ప్పించుకున్నారు. కానీ.. ఆయ‌న అనుచ‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌కర్త‌లు, నాయ‌కులు గాయ‌ప‌డ్డారు. వాహనాల‌పై రాళ్లు ప‌డ‌డంతో అద్దాలు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి.