hyderabadupdates.com movies అనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరి

అనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరి

దర్శకుడు అనిల్ రావిపూడి అందరి అంచనాలకు ఝలక్ ఇస్తూ తన కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. హీరో వెంకటేష్ తో పాటు మరో కథానాయకుడు ఎవరనే సస్పెన్స్ గురించి గత కొన్ని రోజులుగా చాలా లీకులు వచ్చాయి. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్, కార్తీ పేర్లు బలంగా వినిపించాయి.

అయితే నిజంగా సంప్రదింపులు జరిగాయో లేక ఏదైనా కారణాల వల్ల వద్దనుకున్నారో ఏమో కానీ ఫైనల్ గా నందమూరి కళ్యాణ్ రామ్ లాక్ కావడం ఎవరూ అనుకోని కొత్త ట్విస్టు. అనిల్ రావిపూడిని నమ్మి పటాస్ రూపంలో తొలి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామే. డెబ్యూతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది ఈ కాంబో.

తర్వాత ఈ కలయిక మళ్ళీ సాధ్యపడలేదు. పటాస్ 2 కోసం అప్పుడప్పుడు అభిమానులు డిమాండ్ చేస్తున్నా అప్పటికే అనిల్ రావిపూడి పూర్తిగా ఫన్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేతులు కలపడం విశేషమే. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఆన్ స్క్రీన్ కాంబో డిఫరెంట్ గా ఉండబోతోందనేది అర్థమవుతోంది.

ఎక్కువ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కళ్యాణ్ రామ్ కామెడీ కూడా పండించగలడని కొన్ని శాంపిల్స్ పటాస్ లో చూపించాడు అనిల్ రావిపూడి. తర్వాత ఈ యాంగిల్ ఇతర దర్శకులు వాడుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు తిరిగి ఇంకో ఛాన్స్ వచ్చేసింది.

అనుకున్నట్టే 2027 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా ప్రకటించారు. ఒక్కసారి అనౌన్స్ చేశాక ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ కాకుండా చూసుకోవడం అనిల్ రావిపూడికు మాత్రమే సాధ్యమైన విద్య. సో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. దీనికి చాలా పొడవైన టైటిల్ లాక్ చేశారని తెలిసింది.

ఇప్పటికిప్పుడు దీన్ని ప్రకటించకపోవచ్చు కానీ సరైన సందర్భం చూసి రివీల్ చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వచ్చినా లీకుల ప్రకారం ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరిదిగా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు ప్లస్ భార్యల మధ్య కామెడీ ప్రధాన హైలైట్ గా ఉంటుందని  చెబుతున్నారు.

Related Post

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్ డాల్స్‌గానే కనిపిస్తుంటారు. తమ పాత్రలకు ప్రాధాన్యం ఉన్నపుడు వాటికి తమ నటనతో న్యాయం చేయడం.. అలాగే పాటల్లో అందచందాలతో సినిమాకు ఆకర్షణ తీసుకురావడం.. ప్రమోషన్ పరంగా

అసలే ఫ్లాప్ సినిమా… మళ్ళీ రెంట్‌కా?అసలే ఫ్లాప్ సినిమా… మళ్ళీ రెంట్‌కా?

సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ అప్పియరెన్స్‌లో తెరకెక్కిన ‘లాల్ సలామ్’ సినిమా హిందీ వెర్షన్‌ మరో ఓటీటీలోకి వచ్చింది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్

Death by Lightning Premiere: Here’s When and Where You Can Watch the Gripping Historical SeriesDeath by Lightning Premiere: Here’s When and Where You Can Watch the Gripping Historical Series

The show goes beyond historical events, exploring the psychological and moral dimensions of ambition, power, and delusion. It provides viewers with a gripping account of how personal ego and obsession