నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది…! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే. వందలాది దేశాలు తిరిగి అక్కడి నుంచి వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను దాని మాతృ సంస్థ మెటా నిలిపివేసింది. ఇంస్టాగ్రామ్ లో ఆయనకు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిందూ దేవతలపై ఆయన చేసిన కామెంట్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ చర్య అనంతరం అన్వేష్ మరో వీడియో విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను నిలుపుదల చేసినంత మాత్రాన తనకు పోయేది ఏమీ లేదంటూ వ్యంగ్యంగా చెప్పారు. అయితే అన్వేష్ తన హద్దు దాటి మాట్లాడుతున్నారని విమర్శలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.
సొంత అభిప్రాయాలు కలిగి ఉండటం ప్రతి వ్యక్తి హక్కే. అయితే పెద్ద స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తి అయితే, అతని మాటలకు మరింత బాధ్యత అవసరం ఉంటుంది. ప్రజలు ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకునే అవకాశముండటంతో, ప్రతి మాట సామాజిక ప్రభావాన్ని చూపుతుంది.
వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే సమయంలో సామాజిక బాధ్యత, సమాజంలోని వర్గాల మధ్య సమన్వయం, సామరస్యం దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాదరణ పొందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా, సమతుల్యంగా స్పందించడం అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View this post on Instagram