hyderabadupdates.com movies అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

70 ఏళ్ల వ‌య‌సులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవ‌ల మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు చిత్రంతో మెగా ఫ్యాన్స్ క‌ర‌వు తీర్చేశారు చిరు. ఆ సినిమాలో ఆయ‌న కామెడీ టైమింగ్, డ్యాన్సుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఐతే ఈ విజ‌యోత్సాహంలో ఉండ‌గా.. ఇటీవ‌ల చిరు భుజానికి స‌పోర్ట్ పౌచ్ స్లింగ్ ధ‌రించ‌డం చూసి ఫ్యాన్స్ కంగారు ప‌డ్డారు. చిరుకు ఏమైందా అని ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టారు. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డ‌డం చూసి చిరు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. 

తాను భుజానికి స‌పోర్ట్ పౌచ్ స్లింగ్ ధ‌రించ‌డం చూసి త‌న శ్రేయోభిలాషులు, అభిమానులు చాలామంది త‌న‌ను విచారించార‌ని.. త‌న భుజానికి చిన్న శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని.. దాన్నుంచి కోలుకుని దైనందిన కార్య‌క్ర‌మాల్లో కూడా య‌ధావిధిగా పాల్గొంటున్నాన‌ని చిరు తెలిపారు.

త‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయ‌డంతో పాటు జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్న డాక్ట‌ర్ నితిన్ మీద చిరు ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ వైద్యుడితో క‌లిసి ఉన్న ఫొటోను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశాడు చిరు. త‌న ప‌ట్ల అభిమానం చూపించి, ఆశీర్వాదాలు ఇచ్చిన వాళ్లంద‌రికీ చిరు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ఓవైపు మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం, ఇంకోవైపు చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు పుట్ట‌డంతో చిరు అమితానందంలో ఉన్నారు. త‌న కొత్త సినిమా మొద‌లుపెట్టేముందు చిరు కొంత విరామం తీసుకున్నారు.

వాల్తేరు వీర‌య్య త‌ర్వాత‌ బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించ‌బోయే సినిమాకు స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో చిరు న‌డి వ‌య‌స్కుడి పాత్ర పోషిస్తున్న‌ట్లు, ఆయ‌న కూతురి పాత్ర‌లో మ‌ల‌యాళ యువ న‌టి అన‌స్వ‌ర రాజ‌న్ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Related Post

Inspection Bungalow Review: Shabareesh Varma’s horror comedy had the ideas, but not the deliveryInspection Bungalow Review: Shabareesh Varma’s horror comedy had the ideas, but not the delivery

The Verdict Inspection Bungalow is an average attempt at exploring the horror-comedy genre. While the show doesn’t offer much, it’s still a breezy, one-time watch. Disclaimer: The views and opinions