hyderabadupdates.com Gallery అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భార‌త్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 161 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. ఆశించిన ప్లేయ‌ర్లు అంత‌గా ఆడ‌లేక పోయారు . ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ నిరాశ పరిచాడు. ప్ర‌త్యేకించి త‌న ప‌ర్ ఫార్మెన్స్ పై ప్ర‌స్తావించాడు. ఇదే స‌మయంలో భార‌త్ త‌ర‌పున కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ అద్బుతంగా ఆడాడ‌ని, కానీ శ‌ర్మ నిరాశ ప‌రిచాడ‌ని పేర్కొన్నాడు. అమెరికాపై 29 పరుగుల విజయంతో ప్రారంభించింది. స్టార్ స్పోర్ట్స్ అమూల్ క్రికెట్ లైవ్ కార్య‌క్ర‌మంలో సునీల్ గ‌వాస్క‌ర్ మాట్లాడాడు.
గ‌వాస్క‌ర్ తో పాటు పార్థివ్ ప‌టేల్ తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ను ప్ర‌శంసించారు. తిలక్ వర్మ చాలా తెలివైన క్రికెటర్. అతను తన బ్యాటింగ్ నైపుణ్యాలు లేదా షాట్ల శ్రేణికి మాత్రమే కాకుండా, వాటిని ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఆడాలో తెలుసు కున్నందుకు కూడా చాలా ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు. ఇదే ప్లాన్ ను అమెరికాపై చూపించాడ‌ని తెలిపాడు. అభిషేక్ శ‌ర్మ అవుట్ అయిన వెంట‌నే మైదానంలోకి వ‌చ్చాడు వ‌ర్మ‌. దూకుడు పెంచ‌లేదు. కానీ తెలివిగా ప‌రుగులు చేయ‌డం ప్రారంభించాడ‌ని పేర్కొన్నారు. రెండో మ్యాచ్ లో త‌ప్ప‌నిస‌రిగా అభిషేక్ శ‌ర్మ అద్భుతంగా ఆడ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు.
The post అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,

ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్

ISRO LVM3 : బహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. ఈ LVM3-M5

Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్

Martlet Missiles : భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరనుంది. రక్షణరంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్‌-యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్‌’ (Martlet Missiles)లను