hyderabadupdates.com movies అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు అతీతీంగా నాయ‌కులు.. స్పందించారు. జ‌గ‌న్ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు కూడా అదే వైఖ‌రితో ఉన్నారంటూ.. టీడీపీ నాయ‌కులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌ర‌కు విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ వైఖ‌రికి నిర‌స‌న‌గా.. శుక్ర‌వారం రాజ‌ధాని ప్రాంతంలోనూ నిర‌స‌న‌లు చేప‌ట్ట‌నున్నారు.

జ‌గ‌న్ ఏమ‌న్నారు?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గురువారం కొన్ని జాతీయ మీడియా ఛానెళ్ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధానిపై ఆయ‌న మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. “న‌దీతీరం వెంబ‌డి సోకాల్డ్ రాజ‌ధానిని క‌డుతున్నాడు“ అంటూ.. సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “రివ‌ర్ బేసిన్‌లో చంద్ర‌బాబు సోకాల్డ్ రాజ‌ధాని క‌డుతున్నాడు. అయినా.. అంత భూమి ఎందుకు? ఇంత మంది రైతులను ఇబ్బంది పెట్ట‌డం ఎందుకు?“ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌లు ఇటు రాజ‌ధాని రైతుల్లోనూ.. అటు వైసీపీయేత‌ర రాజ‌కీయ నాయ‌కుల్లోనూ దుమారం రేపాయి. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి జ‌గ‌న్ వైఖ‌రి మార‌లేద‌ని.. నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం రాజ‌ధాని వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. నిర్మాణాన్ని విస్త‌రించ‌డంతోపాటు.. విమానాశ్ర‌యం.. వంటి తొలిద‌శ‌లో లేని ప్రాజెక్టుల‌ను కూడా ఈ సారి చేర్చింది. దీంతో రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ కూడా జ‌రుగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో ఉద్దేశ పూర్వ‌కంగా జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని నాయ‌కులు, రాజ‌ధాని రైతులు కూడా త‌ప్పుబ‌ట్టారు. జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రాజ‌ధాని నిర్మాణాన్ని న‌దీ వ‌డ్డున నిర్మిస్తున్నార‌ని.. జ‌గ‌న్ గ‌తంలోనూ చెప్పారు. కానీ, ప్ర‌జ‌లు, కేంద్రంలోని హ‌రిత ట్రైబ్యున‌ల్ కూడా యాక్స‌ప్ట్ చేసిన‌ప్పుడు.. జ‌గ‌న్‌కు వ‌చ్చిన సందేహం ఏంటి? వివాదం ఏంటి? అనేది ప్ర‌శ్న‌. మొత్తంగా.. మ‌రోసారి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌ధానిపై ఆయ‌న నైజాన్ని చాటుతున్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు. 

Related Post

Samantha Prabhu, Raj Nidimoru Perform Sacred Bhuta Shuddhi VivahaSamantha Prabhu, Raj Nidimoru Perform Sacred Bhuta Shuddhi Vivaha

Actor Samantha Ruth Prabhu and filmmaker-producer Raj Nidimoru performed a sacred Bhuta Shuddhi Vivaha ceremony on Monday morning at the Linga Bhairavi Devi abode located inside Sadhguru’s Isha Yoga Center,

ఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలుఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలు

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ఏ స్థాయిలో సెలబ్రేషన్ ఉందో.. ఇప్పుడు అదే స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇండియన్