hyderabadupdates.com Gallery అమెరికా నిర్ణ‌యం ఆక్వా రంగం బ‌లోపేతం

అమెరికా నిర్ణ‌యం ఆక్వా రంగం బ‌లోపేతం

అమెరికా నిర్ణ‌యం ఆక్వా  రంగం బ‌లోపేతం post thumbnail image

అమ‌రావ‌తి : అమెరికా స‌ర్కార్ తాజాగా ప్ర‌క‌టించిన టారిఫ్ త‌గ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మ‌రింత ఆస‌రా క‌ల్పించేందుకు దోహద ప‌డుతుంది. ఈ సంద‌ర్బంగా స్పందించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలోని లాభ మార్జిన్లు కూడా మెరుగవుతాయని, అధిక టారిఫ్ కాలంలో 5–5.5 శాతానికి తగ్గిన ప్రాసెసర్ల మార్జిన్లు టారిఫ్ తగ్గింపు అనంతరం తిరిగి 7–8 శాతం స్థాయికి చేరే అవకాశం ఉంద‌ని చెప్పారు కేంద్ర మంత్రి. కేంద్ర బడ్జెట్ – 2026లో సముద్ర ఆహార ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందించనున్నాయని తెలిపారు.
అమెరికా మార్కెట్ పునరుద్ధరణతో పాటు యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి అమెరికేతర మార్కెట్లకు భారతీయ సముద్ర ఆహార ఎగుమతులు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పారు అచ్చెన్నాయుడు, 2025–26 ప్రారంభంలో ష్రింప్ ఎగుమతుల్లో అమెరికేతర మార్కెట్ల వాటా సుమారు 57 శాతానికి చేరడం మార్కెట్ విభిన్నీకరణకు నిదర్శనమని అన్నారు. దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని తెలిపారు.
ఎగుమతుల పునరుద్ధరణతో రాష్ట్రంలోని మత్స్య, ఆక్వా రంగాల్లో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, స్థూల విలువ జోడింపు (GVA) కూడా మెరుగుపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. MPEDA అంచనాల ప్రకారం 2025–26 లో దేశ వ్యాప్తంగా మొత్తం సముద్ర ఆహార ఎగుమతులు 14–15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. మొత్తం మీద అమెరికా టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడం భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల పునరుద్ధరణకు మార్గం సుగ‌మం అవుతుంద‌న్నారు కింజార‌పు అచ్చెన్నాయుడు. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం స్థిరమైన అభివృద్ధికి కీలకంగా నిలుస్తుందని తెలిపారు.
The post అమెరికా నిర్ణ‌యం ఆక్వా రంగం బ‌లోపేతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావుజ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలుప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన స్థ‌లాల‌లో ఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డ‌డ‌మే కాకుండా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డంపై ఫోక‌స్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌లు సృష్టించారు క‌బ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్‌తో

Deepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డిDeepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి

Deepak Reddy : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్‌ రెడ్డిని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్‌ రెడ్డి వైపే… బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం దీపక్‌