hyderabadupdates.com movies అరడజను రిలీజులతో దిల్ రాజు ప్లానింగ్

అరడజను రిలీజులతో దిల్ రాజు ప్లానింగ్

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, గేమ్ ఛేంజర్ రూపంలో డిజాస్టర్ ఒకేసారి చవిచూసిన దిల్ రాజు బ్యానర్ తర్వాత స్పీడ్ తగ్గించింది. డిస్ట్రిబ్యూషన్ పరంగా యాక్టివ్ ఉన్నప్పటికీ ప్రొడక్షన్ మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నితిన్ తమ్ముడు ఊహించని షాక్ ఇవ్వడం దిల్ రాజుకి పెద్ద స్ట్రోక్. కార్తీ ఖైదీ రేంజ్ లో దీని మీద నమ్మకం పెట్టుకుంటే అంత దారుణంగా పోతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. దెబ్బకు నితిన్ తోనే అనుకున్న ఎల్లమ్మని పెండింగ్ లో పెట్టి దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేయడం దగ్గర ఆగిపోయింది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ ఏడాది ఎలా ఉన్నా 2026లో ఎస్విసి దూకుడు ఓ రేంజ్ లో ఉండబోతోంది. గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న దిల్ రాజు, శిరీష్ మాటలను బట్టి చూస్తే ఇది స్పష్టమవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ దాదాపు ఫిక్స్ అయిపోయింది. సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రాజెక్టు తాజాగా లాక్ చేశారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మరో మూవీ ట్రై చేస్తున్న దిల్ సోదరులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనతో పాటు ఆశిష్ మూవీ ఒకటి, ఎల్లమ్మ కూడా వచ్చే సంవత్సరమే బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి.

ఇలా మొత్తం అరడజను రిలీజులతో దిల్ రాజు సంస్థ కళకళలాడనుంది. ఎలాగూ డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలు కొనసాగుతాయి. సంక్రాంతి బరిలో ఉన్న మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు నైజామ్ హక్కులు దిల్ రాజు ఖాతాలోనే చేరాయి. వేరేవి కూడా ట్రై చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెద్దిని తీసుకునే ప్లాన్ లో కూడా ఉన్నారట. మైత్రి ప్రొడక్షన్ పార్ట్ నర్ కాబట్టి ఏ మేరకు దక్కుతుందో చూడాలి. కన్నడ నుంచి వచ్చిన హోంబాలే, కెవిఎన్ లాంటి సంస్థలు దూసుకుపోతున్న టైంలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ మాత్రం పికప్ చేయడం చాలా అవసరం. పెట్టుబడులు వందల కోట్లలో ఉండబోతున్నాయి.

Related Post

Santhana Prapthirasthu Trends on Jio Hotstar, Enters Amazon Prime Video Top 10Santhana Prapthirasthu Trends on Jio Hotstar, Enters Amazon Prime Video Top 10

The Telugu film Santhana Prapthirasthu is witnessing steady traction on OTT platforms following its digital release on December 19. After completing its theatrical run, the film has found a place