hyderabadupdates.com movies అరాచకం స్పెల్లింగ్ రాయిస్తున్న దురంధర్

అరాచకం స్పెల్లింగ్ రాయిస్తున్న దురంధర్

ఒక సీక్వెల్ కి విపరీతమైన హైప్ రావడం బాహుబలి, కెజిఎఫ్, పుష్పకు చూశాం. అవి మొదటి భాగాలు రిలీజ్ కాకముందే బజ్ తెచ్చుకున్నవి. కానీ దురంధర్ కేసు అది కాదు. గత డిసెంబర్ లో విడుదల ముందు రోజు ప్రెస్ ప్రీమియర్ క్యాన్సిల్ అయ్యింది. ట్రైలర్ మీద పాజిటివ్ టాక్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఊపులో లేవు. కట్ చేస్తే బాలీవుడ్ చరిత్రను ఆ మూవీ తిరగరాస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఏకంగా పదమూడు వందల కోట్లకు పైగా వసూలు చేస్తుందని తలలు పండిన ట్రేడ్ పండితులు అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు దురంధర్ ది రివెంజ్ వరస చూస్తుంటే దానికి మించిపోయేలా ఉంది. కేవలం ప్రీమియర్ షో టికెట్లతోనే ఇప్పటికే పది కోట్లు వసూలైనట్టు ట్రేడ్ టాక్. సుమారుగా రెండు లక్షలకు దగ్గరగా టికెట్లు అమ్ముడుపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా పది రోజుల టైం ఉంది .

ఇప్పుడే ఇలా ఉంటే పద్దెనిమిది తేదీ ఉదయానికి విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ తట్టుకోలేక ముంబై లాంటి నగరాల్లో మధ్యాన్నం రెండు గంటల నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు. అంటే అఫీషియల్ గా ప్రకటించిన అయిదు గంటల కన్నా ముందే షోలు పడబోతున్నాయి. దీన్ని బట్టి ఓపెనింగ్ ఫిగర్ ఎంత పెద్ద నెంబర్ వస్తుందో ఊహకు అందటం లేదు.

ఓవరాల్ గా ఇండియా, ఓవర్సీస్ కలిపి ఓపెనింగ్ డే గ్రాస్ రెండు వందల కోట్లు దాటవచ్చని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. నాలుగు గంటల నిడివి కావడంతో షోలు షెడ్యూల్స్ చేయడం థియేటర్లకు పెద్ద సమస్యగా మారింది. అయిదు షోలకు అనుమతి ఉన్నా నాలుగు షోలకే పదిహేడు గంటల సమయం అయిపోతుంది.

అంటే స్టాఫ్ పగలు రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సిబ్బంది పనిభారంతో ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. హైదరాబాద్ లోనే 18 రాత్రిలోపు మూడు వందలకు పైగా షోలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకుల అభిప్రాయం. అదే నిజమయ్యేలా ఉంది.

Related Post

Home Entertainment Guide: “28 Years Later,” “Materialists,” “Superman,” “Jurassic World Rebirth,” MoreHome Entertainment Guide: “28 Years Later,” “Materialists,” “Superman,” “Jurassic World Rebirth,” More

10 NEW TO NETFLIX “10 Things I Hate About You““28 Years Later““Are You There God? It’s Me, Margaret““The Blackening““Bombshell““Daddy’s Home““Karate Kid Legends““Liar Liar““The Pledge““San Andreas“ 15 NEW TO BLU-RAY/DVD “28

5 Telugu OTT releases to watch this week: Teja Sajja starrer Mirai to Tribanadhari Barbarik5 Telugu OTT releases to watch this week: Teja Sajja starrer Mirai to Tribanadhari Barbarik

Cast: Sathyaraj, Vasishta N. Simha, Satyam Rajesh, Udaya Bhanu, Sanchi Rai, Kranthi Kiran, VTV Ganesh, Rajendran, Meghana Sunil, Kaarthikeyaa Dev Director: Mohan Srivatsa Genre: Thriller Runtime: 1 hour and 48