hyderabadupdates.com movies అల్లు అర్జున్‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది – మెగా హీరో

అల్లు అర్జున్‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది – మెగా హీరో

అల్లు అర్జున్‌కు మిగ‌తా మెగా హీరోల‌తో ఒక‌ప్పుడు మంచి బాండింగే ఉండేది. కానీ గత కొన్నేళ్ల‌లో ప‌రిస్థితులు మారిపోయాయి.. బ‌న్నీ సొంత ఇమేజ్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నంలో మెగా బ్రాండుకు దూరం అయిపోయారు. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ కామెంట్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి మెగా అభిమానుల్లో ఒక వ‌ర్గం బ‌న్నీని ఓన్ చేసుకోవ‌డం లేదు. గ‌త కొన్నేళ్ల‌లో మ‌రి కొన్ని ప‌రిణామాల వ‌ల్ల అభిమానుల్లో అంత‌రం పెరిగింది. కుటుంబంలో కూడా గ్యాప్ వ‌చ్చిన సంకేతాలు కనిపించాయి.

ఈ నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్ తేజ్.. బ‌న్నీ ప‌ట్ల వ్య‌తిరేక‌త‌తో ఉన్నాడ‌నే ఫీలింగ్ మెగా అభిమానుల‌కు క‌లిగింది. బ‌న్నీ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ కామెంట్‌కు కౌంట‌ర్‌గా అత‌ను చెబుతాను బ్ర‌ద‌ర్ అంటూ ఒక ఈవెంట్లో వ్యాఖ్యానించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో బ‌న్నీ మీద తేజు ప్ర‌శంస‌లు కురిపించ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

హైద‌రాబాద్‌లో జ‌న్‌-జ‌డ్ ఆటో ఎక్స్‌పో కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన తేజు.. అక్క‌డి వ‌చ్చిన కాలేజీ విద్యార్థుల‌తో ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్బంగా బ‌న్నీ గురించి ఒకరు ప్ర‌శ్న అడిగారు. దానికి బ‌దులిస్తూ అల్లు అర్జున్‌ను గారు అని సంబోధిస్తూ అత‌డిపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఆయ‌న సూప‌రు. బాగా యాక్ట్ చేస్తారు. ఆయ‌న‌ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒక‌రైపోయారు. ఆయ‌న‌ చాలా గొప్ప‌వాళ్లు అయిపోయారు. ఆయ‌న విష‌యంలో నేను చాలా హ్యాపీ, గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అని తేజు అన్నాడు.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అడిగితే.. ఆయ‌న త‌న‌కు గురువు అని.. చిన్న‌ప్ప‌ట్నుంచి చ‌దువు స‌హా అన్ని విష‌యాల్లోనూ త‌న‌ను గైడ్ చేశార‌ని.. సినిమాల్లోకి రావాల‌నుకున్న‌పుడు ట్రైనింగ్ ద‌గ్గ‌ర్నుంచి ప్ర‌తి విష‌జ్ఞంలోనూ త‌న‌కు గైడెన్స్ ఇచ్చార‌ని.. ఆయ‌న‌తో త‌న అనుబంధం గొప్ప‌ద‌ని తేజు అన్నాడు. ప్ర‌భాస్ గురించి అడిగితే.. అత‌ను డార్లింగ్ అని, స్వీటెస్ట్ ప‌ర్స‌న్ అని కొనియాడాడు తేజు. ఇక యూత్ అంతా వాహ‌నాలు న‌డిపేటపుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. హెల్మెంట్ త‌ప్ప‌క ధ‌రించాల‌ని.. అది వేసుకోవ‌డం వ‌ల్లే ఈ రోజు తాను ప్రాణాల‌తో ఉన్నాన‌ని తేజు చెప్పాడు.

Related Post

The Girlfriend on OTT: Rahul Ravindran’s bold reply to an abuser stuns everyoneThe Girlfriend on OTT: Rahul Ravindran’s bold reply to an abuser stuns everyone

Rashmika Mandanna’s The Girlfriend is stirring conversations on social media following its OTT release on Netflix. With the film now reaching a wider audience, Rahul Ravindran’s directorial is getting more