hyderabadupdates.com movies అల్లు వారు అలా అన్నారో లేదో…

అల్లు వారు అలా అన్నారో లేదో…

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్.. డెకాయిట్ సినిమా స‌క్సెస్ మీట్లో ఈ చిత్ర క‌థానాయిక మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గ‌తంలో తాను ఇక్క‌డి అబ్బాయిని పెళ్లి చేసుకోమ‌ని లావ‌ణ్య త్రిపాఠికి చెబితే, ఆమె వ‌రుణ్‌తేజ్‌ను పెళ్లాడి హైద‌రాబాద్‌లో సెటిలైపోయిన విష‌యాన్ని గుర్తు చేసిన అర‌వింద్.. మృణాల్ కూడా ఇక్క‌డి అబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్క‌డే ఉండిపోవాల‌ని ఆకాంక్షించారు.

దీంతో మృణాల్ తెగ సిగ్గుప‌డిపోయింది. ఆడిటోరియం అంతా న‌వ్వుల‌తో నిండిపోయింది. ఐతే అర‌వింద్ ఈ కామెంట్ చేసిన కాసేప‌టికే సోష‌ల్ మీడియా జ‌నాలు డ్యూటీ ఎక్కేశారు. లావ‌ణ్య‌.. వ‌రుణ్‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసే అర‌వింద్ అప్ప‌ట్లో ఆ కామెంట్ చేశార‌ని, ఇప్పుడు మృణాల్ కూడా ఇక్క‌డ ఓ అబ్బాయిని చూసుకుంది కాబ‌ట్టే ఆయ‌న ఇలా మాట్లాడార‌ని క‌థ‌లు అల్లేశారు. అంతే కాక ఆ అబ్బాయి ఎవ‌రో కూడా చెప్పేశారు.

అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్‌తో మృణాల్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా పేర్కొంటూ వీళ్లిద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తున్నారు నెటిజ‌న్లు. సుమంత్, మృణాల్ క‌లిసి సీతారామం సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ ఎక్క‌డో ఒక ఫొటోకు పోజు ఇచ్చారు.

ఆర్టిస్టులు క‌లిసి న‌టించిన‌పుడు ఇలా ఫొటోలు దిగ‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. కానీ సోష‌ల్ మీడియా జ‌నాలు మాత్రం ఇలా ఆలోచించ‌డం లేదు. ఇద్ద‌రికీ లింక్ పెట్టేశారు. కానీ డెకాయిట్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మృణాల్.. సుమంత్‌ను అన్నా అని సంబోధించిన విష‌యాన్ని మ‌ర‌వ‌కూడ‌దు. అన్న అనే ప‌దానికి అర్థం తెలియ‌కుండానే ఆమె అలా అని ఉండ‌దు.

సుమంత్‌కు గ‌తంలో హీరోయిన్ కీర్తి రెడ్డితో పెళ్ల‌యింది. కొంత కాలానికే ఇద్ద‌రూ విడిపోయారు. 20 ఏళ్ల‌కు పైగా సుమంత్ సింగిల్‌గానే ఉంటున్నాడు. త‌న‌కు మ‌ళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ‌మే ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. పైగా సుమంత్‌కు 51 ఏళ్లు వ‌చ్చేశాయి. మృణాల్ కంటే అత‌ను చాలా పెద్ద‌వాడు. వ‌య‌సు 50 దాటినా, అమ్మాయితో వ‌య‌సు అంత‌రం ఉన్నా పెళ్లి చేసుకోవ‌డానికి అవేవీ అడ్డంకులు కాదు కానీ.. సుమంత్, మృణాల్ మ‌ధ్య ఎలాంటి వ్య‌క్తిగ‌త‌ బంధం లేద‌న్న‌ది క్లియ‌ర్‌గా తెలుస్తున్నా.. ఇలా లింక్ పెట్టేయ‌డం విచిత్రం.

Related Post

Andhra King Taluka Gets Strong Reviews… But Collections Take a Sudden Dip!Andhra King Taluka Gets Strong Reviews… But Collections Take a Sudden Dip!

Ram Pothineni’s Andhra King Taluka came out with strong unanimous reviews and was widely expected to deliver a solid comeback for the energetic star. With positive word-of-mouth, good songs, stylish