hyderabadupdates.com movies అవసరమైన ప్రతిభ చూపించిన అనస్వర

అవసరమైన ప్రతిభ చూపించిన అనస్వర

ఇటీవలే విడుదలైన ఛాంపియన్ ద్వారా మలయాళ కుట్టి అనస్వర రాజన్ పరిచయమయ్యింది. రామ్ చరణ్ అంతటి స్టారే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మీద పొగడ్తల వర్షం కురిపించడమే కాక స్వంతంగా డబ్బింగ్ చెప్పడం గురించి గొప్పగా వర్ణించాడు. అంతగా ఏముందని సినిమా చూసిన ప్రేక్షకులకు ఆ మాటలు నిజమే అనిపించింది.

లుక్స్, నటన, డాన్సులో చాలా చలాకీగా నటించిన అనస్వర రాజన్ కు మంచి అవకాశాలు పడితే కీర్తి సురేష్, రష్మిక మందన్న తరహాలో తక్కువ టైంలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకోవచ్చు. కాకపోతే సరైన సెలక్షన్ లేకపోతే ఎదురుదెబ్బలు తగులుతాయి.

యాక్టింగ్ పరంగా ఇంతగా ఆకట్టుకున్న అనస్వర రాజన్ ది ఆషామాషీ బ్యాక్ గ్రౌండ్ కాదు. 2017లో విడుదలైన ఉదాహరణం సుజాతలో మంజు వారియర్ కూతురిగా నటించి డెబ్యూతోనే పేరు తెచ్చుకుంది. 2019లో వచ్చిన తన్నీర్ మథన్ దినంగల్ బ్లాక్ బస్టర్ కావడం తన కెరీర్ ని మలుపు తిప్పింది.

సూపర్ శరణ్య ద్వారా ఆమె అసలు టాలెంట్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. మోహన్ లాల్ నేరులో చూపు లేని అమ్మాయిగా తన పెర్ఫార్మన్స్ కు గొప్ప ప్రశంసలు దక్కాయి. హిందీలో యారియాన్ 2, తమిళంలో రాంగితో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ఆఫర్లు పెద్దగా రాలేదు.

కానీ ఛాంపియన్ కేసు వేరు. అనస్వర రాజన్ మొదటి టెస్టులోనే ఫస్ట్ క్లాస్ లో పాసయ్యింది. ముఖ్యంగా లవ్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ లో భాష నేర్చుకుని మరీ చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతానికి తనను కలిసిన దర్శక నిర్మాతలు ఎవరో కానీ చరణ్ చెప్పినట్టు ఆఫర్లు మాత్రం వచ్చేలా ఉన్నాయి.

టాలీవుడ్ లో అసలే హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కోరిమరీ జాన్వీ కపూర్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడు అనస్వర రూపంలో కొత్త ఆప్షన్ దొరికింది కాబట్టి ఆర్సి 17 కోసం దర్శకుడు సుకుమార్ ఈమెను ఏమైనా పరిశీలిస్తారో లేదో చూడాలి.

Related Post

Balakrishna to Be Honoured at IFFI 2025 for Completing 50 Years in CinemaBalakrishna to Be Honoured at IFFI 2025 for Completing 50 Years in Cinema

The 56th International Film Festival of India (IFFI) is set to celebrate a landmark moment in Indian cinema as legendary Telugu actor and Padma Bhushan awardee Nandamuri Balakrishna will be

బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?

తెలుగు సినిమా నటిగా ఆమని అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు అందరి హీరోల పక్కన నటించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని