hyderabadupdates.com Gallery అశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లు

అశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లు

అశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లు post thumbnail image

తాను జ్యోతిష్కుడిన‌ని, ఆపై దైవాంస సంభూతుడినంటూ పెద్ద ఎత్తున మోసాల‌కు, లైంగిక వేధింపుల‌కు, బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డిన దొంగ బాబా అవ‌తారం ఎత్తిన అశోక్ ఖార‌త్ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ దేశంలో న‌కిలీ బాబాలు, స్వామీజీల‌కు కొద‌వ లేకుండా పోయింది. విచిత్రం ఏమిటంటే అశోక్ ఖార‌త్ మాయలో ప‌డిన వాళ్ల‌లో చాలా మంది పేరు పొందిన మ‌హిళ‌లు, వ్యాపార‌వేత్త‌లు ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. త‌న అరెస్ట్ తో దెబ్బ‌కు మ‌హారాష్ట్ర మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వికి ఏకంగా రాజీనామా చేసింది రూపాలీ . మ‌నుషుల బ‌ల‌హీన‌తలే త‌న‌కు బ‌లంగా మారాయి. అందినంత మేర దోచుకోవ‌డం మొద‌లు పెట్టాడు. త‌న వ‌ద్ద లైంగిక కార్య‌క‌లాపాల‌కు సంబంధించి భారీ ఎత్తున వీడియోలు ల‌భించాయి పోలీసుల సోదాలో దొరికిన పెన్ డ్రైవ్ లో.
విచిత్రం ఏమిటంటే కిలోకు ₹100 విలువ చేసే సాధారణ చింత గింజలను, అవి “అద్భుత గింజలు” అని నమ్మబలికాడు. ఆపై కిలోకు రూ. ల‌క్ష చొప్పున బాధితుల‌కు అమ్మాడు. వీటి ద్వారానే క‌నీసం రూ. 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి ఉంటాడ‌ని స‌మాచారం. తన 10-12 ఏళ్ల అక్రమ, దుర్మార్గపు వ్యాపార కాలంలో, అశోక్ ఖరత్ సుమారు 154 దేశాలలో పర్యటించాడు, టర్కీని 15 సార్లు సందర్శించాడు. ఆపై నల్లధనాన్ని చలామణి చేయడం ద్వారా రూ. 1500 కోట్లకు పైగా విలువైన ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అశోక్ ఖరత్ వందలాది మంది మహిళలను లైంగికంగా దోపిడీ చేశాడు. ఒక 24 ఏళ్ల యువతి కేసు నమోదు చేసినప్పుడు, తనను తాను దేవుడిగా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు.
మోసం, కుట్ర, నిజాయితీ రాహిత్యం, బెదిరింపులు , రౌడీయిజం ద్వారా అనేక మంది స్త్రీ పురుషుల ప్లాట్లు, దుకాణాలు, వ్యాపారాలను కబ్జా చేశాడు. అతను మహారాష్ట్రలోని పేరు మోసిన రాజ‌కీయ నేత‌ల‌తో పాటు కేంద్ర మంత్రులను తన స్థలానికి పిలిపించి, వారిని తన ‘రాసలీలల’లో భాగం చేసుకునే వాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ను బ్రోక‌ర్ గా ఉన్నాడ‌ని, వేల కోట్ల ఆస్తుల‌కు అధిప‌తిగా మారాడ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అశోక్ ఖార‌త్ పై 9 ఎఫ్ఐఆర్ కేసులు న‌మోద‌య్యాయి. న‌ర బ‌లి కూడా ఇచ్చిన‌ట్లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి త‌న‌పై. ఇక జ‌రిపిన సోదాల్లో 276 వీడియోలు పోలీసుల‌కు చిక్కిన‌ట్లు టాక్.
The post అశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలిహోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి ఆయన

యువ‌త కృషి చేస్తే స‌క్సెస్ సాధ్యం : స‌త్య‌కుమార్యువ‌త కృషి చేస్తే స‌క్సెస్ సాధ్యం : స‌త్య‌కుమార్

విజ‌య‌వాడ : యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సహకారం చేసుకునే దిశగా ముందుకు సాగాల‌ని

అధికారంలోకి వ‌స్తాం ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను వ‌ద‌లంఅధికారంలోకి వ‌స్తాం ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను వ‌ద‌లం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. కావాల‌ని త‌మ‌ను ఇబ్బంది పెట్టే పోలీసు ఉన్న‌తాధికారుల‌పై భ‌గ్గుమ‌న్నారు. వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, ఆరోజు మీరు ఎక్క‌డున్నా, ఏ మూల