hyderabadupdates.com Gallery అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్ post thumbnail image

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను త‌న సార‌థ్యంలో రెండుసార్లు విశ్వ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని, త‌మ కుర్రాళ్లు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక మ్యాచ్ లో కీల‌క భూమిక పోషించార‌ని అన్నాడు. కానీ ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సి వ‌స్తే ఇద్ద‌రు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించార‌ని చెప్పాడు గెలుపొందిన అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్. ఒక‌రు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ కాగా మ‌రొక‌రు ముంబైకి చెందిన స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అన్నాడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో అడ్డుగోడ‌లా నిల‌బ‌డి సెమీ ఫైన‌ల్ కు తీసుకు వ‌చ్చాడంటూ శాంస‌న్ గురించి తెలిపాడు. అంతే కాదు సెమీ ఫైనలలో సైతం స‌త్తా చాటాడ‌ని, ఇక ఫైన‌ల్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడ‌ని కితాబు ఇచ్చాడు.
ఇది చెప్ప‌లేని సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని అన్నాడు సూర్య భాయ్ . కోచ్ , మేనేజ్మెంట్, బీసీసీఐ పెద్ద‌లు, తోటి ఆట‌గాళ్లు, అభిమానులు, ఆ దేవుడి ఆశీస్సులు అన్నీ త‌మ‌కు ఉన్నాయ‌ని చెప్పాడు. జీవితంలో మ‌రిచి పోలేని క్ష‌ణం ఇది అని పేర్కొన్నాడు. ఇలాంటి క్ష‌ణాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని, ఒక‌నాడు ఇదే వేదిక మీద తాము ఓడి పోయామ‌ని, కానీ ఇప్పుడు ఇదే స్థానంలో త‌ల ఎత్తుకుని క‌ప్ ను అందుకున్నామ‌ని, ఇక సెంటిమెంట్ల‌కు తావు లేద‌ని తాము నిరూపించామ‌ని అన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచ కప్ తర్వాత ఆ సమయంలో బీసీసీఐ కార్య‌ద‌ర్శితో పాటు రోహిత్ శ‌ర్మ నాకు స‌హ‌కారం అందించార‌ని తెలిపాడు. గ‌త రెండు ఏళ్లుగా మేం ఇదే ఫార్మాట్ లో ఆడుతున్నాం. ఎన్నో అనుభ‌వాలు ఉన్నాయ‌ని చెప్పాడు.
The post అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలు రావాలిటాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలు రావాలి

అమరావతి : ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ప్రజా కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, జరుగుతోన్న ప్రగతికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. ముఖ్యంగా అటవీ శాఖ పనితీరు పీపుల్స్ ఫ్రెండ్లీగా మరింతగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక

అవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌రఅవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌ర

హైద‌రాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు మాన‌వీయ కోణంతో ఆలోచించాల‌ని, రోగుల కు మెరుగైన సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. స‌చివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్