hyderabadupdates.com Gallery అసెంబ్లీ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్న‌వి

అసెంబ్లీ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్న‌వి

అసెంబ్లీ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్న‌వి post thumbnail image

చెన్నై : ఓ వైపు ఆస్తుల వివాదాలు ఇంకో వైపు కేసుల ప‌రంపర కొన‌సాగుతున్న త‌రుణంలో తీవ్ర ఉక్కిరి బిక్కిరికి గురైన ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం దేశ వ్యాప్తంగా హోళీ పండుగ‌ను జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ పెట్టిన స‌మ‌యంలోనే తాను ఇవ‌న్నీ వ‌స్తాయ‌ని త‌న‌కు తెలుస‌ని అన్నాడు. అన్నింటిని ఎదుర్కొనే స‌త్తా త‌న‌కు ఉంద‌న్నాడు. అందుకే తాను ఇప్పుడు ఏమీ మాట్లాడ‌బోనంటూ ప్ర‌క‌టించాడు. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మ‌ని, త‌న‌కే కాదు త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా అని ప్ర‌స్తావించాడు విజ‌య్.
ఈ సంద‌ర్బంగా శాస‌న స‌భ ఎన్నిక‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నాకు ‘ భావోద్వేగం’ అని నటుడు విజయ్ పిటిఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఇతరులకు ఇది సాధారణ ఎన్నికలా అనిపించవచ్చు, కానీ నాకు, నన్ను ప్రేమించే ప్రజలకు ఇది ఒక భావోద్వేగంతో కూడుకుని ఉన్న అంశమ‌ని, అంత‌కంటే ఎక్కువేన‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య్. ఇక్క‌డ ఇవాళ జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌సంగించారు టీవీకే చీఫ్ విజ‌య్. రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల చిహ్నం “విజిల్” తమిళనాడు అంతటా ప్రతి ఇంట్లో , ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రతిధ్వనించాల‌ని పిలుపునిచ్చారు.
ఇదే క్ర‌మంలో మ‌రోసారి విజ‌య్ అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేశారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చ‌రిల్లి పోయింద‌ని ఆరోపించారు. అదో దుష్ట శ‌క్తి అని, దానిని త‌రిమి కొట్టాల‌ని కోరారు.
The post అసెంబ్లీ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్న‌వి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలుశ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు

హైద‌రాబాద్ : కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు

Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?

  బీహార్‌ లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్‌ బంధన్‌

గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారంగ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. గ‌త పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేద‌న చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు.