hyderabadupdates.com movies అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే విడుదల కావడం. లాయర్ గా తను ప్రధాన పాత్ర పోషించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మీద భీభత్సమైన అంచనాలు లేవు కానీ ఉన్నంతలో ఏదో కంటెంట్ ఉండొచ్చనే నమ్మకం మూవీ లవర్స్ లో కలిగింది.

అందులోనూ దురంధర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత నార్త్ బాక్సాఫిస్ ఒక్కసారిగా కుదేలైపోయింది. బోర్డర్ 2 ఒక్కటే హిట్ ముద్ర వేయించుకుని గట్టెక్కింది. ఏదో అద్భుతం చేస్తుందన్న షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రిల ఓ రోమియో దారుణంగా బోల్తా కొట్టడంతో ఆశలన్నీ అస్సీ మీదే ఉన్నాయి. మరి ఇంత బిల్డప్ ఇచ్చిన ఈ సినిమాలో అంత మ్యాటరుందా అంటే ఎస్ అనే ఆన్సర్ లేదు.

కథగా చెప్పుకుంటే ఇందులో కొత్త పాయింట్ ఏం లేదు. రాత్రి పూట ఇంటికి వెళ్తున్న ఒక వివాహిత స్కూల్ టీచర్ ని అయిదుగురు యువకులు కిడ్నాప్ చేసి దారుణ మానభంగం అయ్యాక రైల్వే ట్రాక్ మీద పారేసి వెళ్తారు. పోలీసులు నలుగురిని పట్టుకుంటారు.

కొన ప్రాణాలతో బయట పడిన టీచర్ తరఫున వాదించేందుకు లాయర్ రావి (తాప్సీ  పన్ను) రంగంలోకి దిగుతుంది. అపోజిషన్ లాయర్ రకరకాల ఎత్తులు వేస్తాడు. ఈ లోగా అంబ్రెల్లా మ్యాన్ అనే పేరుతో ఒక అగంతకుడు హంతకుల్లో ఇద్దరిని చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, చివరికి సదరు టీచర్ కి న్యాయస్థానంలో న్యాయం దొరికిందా లేదానేది అసలు స్టోరీ.

సబ్జెక్టులో బలమున్నా దాన్ని అంతే ప్రభావవంతంగా దర్శకుడు అనుభవ్ సిన్హా తెరకెక్కించలేదు. కొన్ని సన్నివేశాలు, ఎపిసోడ్లు చాలా రియలిస్టిక్ గా ఉండగా అధిక భాగం ఓవర్ డ్రామాతో నెమ్మదిగా సాగడం ఆసక్తి తగ్గించేస్తుంది. కోర్ట్ ఆర్గుమెంట్స్ లో పెద్దగా పస లేకపోవడం, నేరస్థుల బ్యాక్ గ్రౌండ్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం లాంటి కారణాలు ఇంపాక్ట్ తగ్గించేశాయి.

మరీ దారుణంగా లేదు కానీ అంచనాలను అందుకోవడంలో మాత్రం అనుభవ్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. తాప్సితో పాటు టీచర్ గా నటించిన కని కుస్రుతి నటన బలంగా నిలిచింది. మొత్తానికి ఫలితం పరంగా అస్సీ యావరేజ్ దగ్గరే ఆగిపోయేలా ఉంది.

Related Post

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణంబాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు స‌హా.. ఉమ్మ‌డి కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల జోరు పెరిగింది. అయితే.. ఒక‌ప్పుడు కేవ‌లం ఉభ‌య