hyderabadupdates.com Gallery ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు సీఎస్కేకు అత్యంత కీల‌కం

ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు సీఎస్కేకు అత్యంత కీల‌కం

ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు సీఎస్కేకు అత్యంత కీల‌కం post thumbnail image

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ వ్యాఖ్యాత‌, ఎన‌లిస్ట్ హ‌ర్షా భోగ్లే ఐపీఎల్ 2026 మెగా టోర్నీకి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం 10 జట్లు ఐపీఎల్ క‌ప్ కోసం త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యాయి. ఈ టోర్నీ అధికారికంగా మార్చి 28న శ‌నివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఆడ‌నుంది. ఈ సంద‌ర్బంగా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు హ‌ర్ష భోగ్లే. ఆయ‌న వ‌రుస‌గా ఆయా జ‌ట్ల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల గురించి చెబుతూ వ‌స్తున్నారు. ఈసారి హాట్ ఫెవ‌రేట్ గా ఆయా జ‌ట్ల‌ను కొంద‌రు ఎన‌లిస్టులు, మాజీ క్రికెట‌ర్లు పేర్కొంటున్న‌ప్ప‌టికీ హ‌ర్షా భోగ్లే మాత్రం కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు గురించి.
గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఈ సారి ఊహించ‌ని రీతిలో ఇద్ద‌రు కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను ఒకే ఒక్క ఆట‌గాడి కోసం వ‌దులుకుంది సీఎస్కే టీం మేనేజ్మెంట్. జ‌ట్టులోకి ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోగా నిలిచిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ రాక‌తో మ‌రింత బ‌లం పెరిగింద‌న్నాడు. త‌ను ఇదే ఫామ్ గ‌నుక కొన‌సాగిస్తే చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు ఇక తిరుగే ఉండ‌ద‌న్నాడు హ‌ర్షా భోగ్లే. ఇక కీల‌క‌మైన ఓపెనింగ్ విష‌యానికి వ‌స్తే అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్న ఆయుష్ మాత్రే కాకుండా సంజు శాంస‌న్ తో క‌లిసి రుతురాజ్ గైక్వాడ్ రానున్నాడ‌ని, ఇక బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మేన‌ని అన్నాడు.
The post ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు సీఎస్కేకు అత్యంత కీల‌కం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలిగోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు. ఆధ్యాత్మ‌కత ఉట్టి ప‌డేలా ఆల‌యాల‌ను కూడా స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తాజాగా

Mother: ఇన్సురెన్స్ డబ్బుల కోసం లవర్‌ తో కలిసి కొడుకును చంపేసిన తల్లిMother: ఇన్సురెన్స్ డబ్బుల కోసం లవర్‌ తో కలిసి కొడుకును చంపేసిన తల్లి

Mother : సాధారణంగా ప్రతీ తల్లి తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. బిడ్డల కోసం తన సంతోషాన్ని పక్కన పెడుతుంది. తను పస్తులు ఉండి బిడ్డల ఆకలి తీరుస్తుంది. కానీ కాన్పూర్ లో ఓ తల్లి (Mother) అత్యంత క్రూరంగా

Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌

    అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు.