hyderabadupdates.com movies ఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వైసీపీ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడం మొదలు పొలాల రీ సర్వే చేయడం వరకు జగన్ చేసిన పనులకు ప్రజలు తమ భూములు కోల్పోతామేమోనని భయపడ్డారు.

అయితే, కూటమి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. దాంతోపాటు రాష్ట్రంలోని మరో 4 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించబోతున్నామని తెలిపింది. రైతులకు కొత్త సంవత్సర కానుక ఇస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు ఉపేక్షించవద్దని, దానిని సుమోటోగా తీసుకోవాలని ఆదేశించారు. సైనిక, మాజీ సైనిక ఉద్యోగుల, స్వాతంత్య్ర సమరయోధుల భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు, భూ యాజమానుల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల భూములకు రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.

Related Post

ప్లాస్టిక్ రోడ్లు వచ్చేశాయ్: హైదరాబాద్ లో ఎక్కడో తెలుసా?ప్లాస్టిక్ రోడ్లు వచ్చేశాయ్: హైదరాబాద్ లో ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ రోడ్లపై కొత్త లుక్ రాబోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన అందమైన ఫుట్‌పాత్‌లు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో దర్శనమివ్వబోతున్నాయి. GHMC – గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 1.68 కోట్లతో ఒక వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రామానాయుడు స్టూడియో నుంచి

వద్దన్న బిరుదు… వదిలేయడం మంచిదేవద్దన్న బిరుదు… వదిలేయడం మంచిదే

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న కంప్లయింట్ రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వద్దని. ఆర్ఆర్ఆర్ టైంలో తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్న టైంలో ఈ

KGF co-director Kirtan Nadagouda’s 4-year-old son Chiranjeevi passes awayKGF co-director Kirtan Nadagouda’s 4-year-old son Chiranjeevi passes away

While further details about the project have not yet been revealed, the film stars Surya Raj, Hanu Reddy, and Preethi Pagadala in lead roles. Dinesh Divakaran will serve as the