ముంబై : ఇండియన్ క్రికెట్ కోచ్ సంజయ్ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియా టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది. వరుస విజయాలను చవి చూసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కీలకమైన దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ తలపడనుంది సూపర్ – 8లో. అంచనాలు భారీగా ఉన్నాయని, కానీ వాటిని తాము అందుకోలేక పోయామని అన్నాడు. ఎక్కువగా తాము సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బాగా రాణిస్తారని ఆశించామన్నాడు. కానీ వారు తీవ్ర నిరాశకు గురి చేశాడన్నారు సంజయ్ బంగర్. ఈ టి20 ప్రపంచ కప్‌లో భారతదేశం ప్రయాణంలో ముగ్గురు ఆటగాళ్లు అత్యంత కీలకం కానున్నారని చెప్పాడు.
వారిలో ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాడు. తను శుక్రవారం జియో స్టార్ తో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టి20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌ను పునరావృతం చేస్తూ ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు. ‘ఫాలో ది బ్లూస్’లో మాట్లాడుతూ ఇంకా బలమైన జట్టుగా రూపొందక పోవడం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భారతదేశం తప్పనిసరిగా ప్రత్యర్థులను బుల్డోజ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అయితే జట్టు నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన ఇంకా రాలేదన్నాడు. ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్న విధానం బాగుందని, కానీ శర్మ ఆట తీరు ఒకింత ఆందోళన కలిగిస్తోందని అన్నాడు సంజయ్ బంగర్.
The post ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇండియాకు కీలకం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇండియాకు కీలకం
Categories: