hyderabadupdates.com Gallery ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌డ‌గాల్పుల దెబ్బ‌కు విల‌విల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌డ‌గాల్పుల దెబ్బ‌కు విల‌విల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌డ‌గాల్పుల దెబ్బ‌కు విల‌విల‌ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ వాతావ‌ర‌ణ శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసింది ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు. ఎండ వేడిమి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరింది. సోమవారం నాడు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్ల‌డించింది. అంతే కాకుండా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ సంద‌ర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్ర‌క‌ర్ జైన్ వెల్ల‌డించారు.
శ్రీకాకుళం జిల్లాలో (9 మండలాలు), విజయనగరం (18), పార్వతీపురం మన్యం (15), అల్లూరి (1), పోలవరం (3), అనకాపల్లి (3), ఏలూరు (2) జిల్లాల్లోని మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం (2 మండలాలు), విజయనగరం (5), అల్లూరి (4), పోలవరం (9), అనకాపల్లి (5), కాకినాడ (5), తూర్పు గోదావరి (9), ఏలూరు (4), NTR (3), పల్నాడు (2), నంద్యాల (1) జిల్లాల్లోని మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కడప జిల్లాలోని పొట్టిపాడులో గరిష్ట ఉష్ణోగ్రత 43.8 డిగ్రీల సెల్సియస్‌గా, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలుగా, నంద్యాలలో 42.9 డిగ్రీలుగా , అనంతపురం జిల్లాలోని తెరణ్ణపల్లెలో 42.3 డిగ్రీలుగా నమోదైనట్లు జైన్ పేర్కొన్నారు. ఎండకు గురికాకుండా ఉండటం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ సూచించారు.
The post ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌డ‌గాల్పుల దెబ్బ‌కు విల‌విల‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందుSuper Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు

    కార్తీక పౌర్ణమి వేళ… ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్ ఏర్పడింది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు

అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వంఅంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస గిరిపై కొలువై అధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో

భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అమెరికా : దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌త దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా త‌మ‌కు సుంకాలు చెల్లిస్తుంద‌ని, కానీ తాము వారికి ఎట్టి ప‌రిస్థితుల్లో చెల్లించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. శ‌నివారం ట్రంప్ మీడియాతో