hyderabadupdates.com Gallery ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ post thumbnail image

హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ దురంధ‌ర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సినీ విశ్లేష‌కులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. నాకు ధురందర్-1 చాలా నచ్చింద‌ని, కానీ ‘ది రివెంజ్’ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు చిత్రాన్ని మించి పోయిందన్నాడు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, ప్రపంచ రూపకల్పన, దర్శకత్వం అన్నీ దోషరహితంగా ఉన్నాయి. కానీ, ఇందులోని భావోద్వేగ భరితమైన అంశాలే ఈ సినిమాకు అసలైన ఆధారాన్ని ఇచ్చాయని స్ప‌ష్టం చేశారు జ‌క్క‌న్న అలియాస్ ఎస్ఎస్ రాజ‌మౌళి.
రచన, భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో మలుపులను అద్భుతంగా ఉంద‌న్నాడు . ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కు పోవ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభే కార‌ణ‌మ‌న్నారు. అద్భుతమైన నటన అని పేర్కొన్నారు. షెడ్డులో సోదరితో ఉన్న సన్నివేశం నటనలో ఒక మాస్టర్ క్లాస్. ఆ ప్రారంభం నుండి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు, హమ్జా జస్కిరత్‌గా మీరిద్దరూ మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేశారని ప్ర‌శంసించారు.
The post ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీఅతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అమరావతి : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు

క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్ చిన్మ‌యి శ్రీ‌పాద సీరియ‌స్క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్ చిన్మ‌యి శ్రీ‌పాద సీరియ‌స్

చెన్నై : ఇల‌య నాయ‌గ‌న్, ప్ర‌ముఖ న‌టుడు, రాజ్య‌సభ సభ్యుడు క‌మ‌ల్ హాస‌న్ పై సీరియ‌స్ అయ్యారు ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి శ్రీ‌పాద‌. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వైర‌ముత్తుపై గ‌తంలో త‌ను

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే