hyderabadupdates.com Gallery ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది

ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది

ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది post thumbnail image

అమ‌రావ‌తి : జగన్ అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచి పోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇదే విషయమై ఆనాడే జగన్ ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి ఉండాల్సిందన్నారు. జగన్ తీరుతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు పట్టించు కోవడం మానేసి, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల చేష్టలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమకు తాగు, సాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ నాయకుల పొలాలకు నీరు వస్తుందంటే అది కూడా సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి సవిత స్పష్టంచేశారు.
రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2014-19 మధ్య రాయలసీమ తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,441 కోట్లు వెచ్చించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ అయిదేళ్లలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూ.3,870 కోట్లతో హంద్రీ-నీవా కాలువను అభివృద్ధి కుప్పం వరకూ సాగు నీరందించామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్, పారిశ్రామిక, పర్యాటక హబ్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధిక శాతం ఏపీకే తరలొస్తున్నాయన్నారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబు విజనేనని మంత్రి సవిత కొనియాడారు.
The post ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

    ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్‌ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్

Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ… అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంCM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

  తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది.