hyderabadupdates.com Gallery ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం

ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం

ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం :  సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. డిసెంబ‌ర్ 6 , 2023 వ‌ర‌కు ఆరోగ్య శ్రీ కోసం ప్ర‌తి నెల యావ‌రేజ్ గా 89 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు. బ‌కాయిల వ‌ల్ల ప్ర‌వైట్ ఆస్ప‌త్రులు మూత ప‌డుతున్నాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.
బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ బ‌కాయిలు పెట్టిందన్నారు. ఈ రోజు వ‌ర‌కు 2408 కోట్ల రూపాయ‌ల‌ను ఆరోగ్య శ్రీ కోసం చెల్లించిన‌ట్లు వెల్ల‌డించారు సీఎం. ఇందులో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 927 కోట్లు, ప్ర‌వైట్ ఆస్ప‌త్రుల‌కు 1480 కోట్లు చెల్లించడం జరిగింద‌న్నారు. ఈ రోజు వ‌ర‌కు ఉన్న బ‌కాయిలు 727 కోట్లు మాత్ర‌మేన‌ని చెప్పారు.
ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు జ‌రుగుతున్నాయని తెలిపారు సీఎం.. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన బ‌కాయిలే పెండింగ్ లో ఉంటున్నాయన్నారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు ఆరోగ్య శ్రీ బ‌కాయిలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ చెల్లింపుల‌పైన అపోహ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మ‌ధ్య‌న ఆరోగ్య శ్రీ లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ విష‌యంలో గ‌తంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. కొంత మంది ఈ స‌హాయ నిధిని దుర్వినియోగం చేశారని, కేసులు కూడా పెట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు. త‌మ‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆన్ లైన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాం అన్నారు. దీని వ‌ల్ల అక్ర‌మాల‌కు అవ‌కాశం లేకుండా పోయిందన్నారు.
The post ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా పాల‌న‌లో తీసుకున్న నిర్ణ‌యాలు, చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా మంజూరు చేసిన నిధుల గురించి

మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీమెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ

వ‌డోద‌ర : కీవీస్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రోసారి స‌త్తా చాటాడు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వ‌య‌సులో 91 బంతుల్లో 93 ర‌న్స్ చేశాడు. మ్యాచ్ విజ‌యంలో కీల‌క

Coromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దతCoromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దత

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతోపాటు.. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీబీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.