hyderabadupdates.com Gallery ‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం

‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం

‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం post thumbnail image

అమరావతి : అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. ఆర్డీటీ విదేశీ నిధుల రెన్యూవల్ కు సహకరించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి, బంగారు శ్రావణితో కలిసి ఆమె మాట్లాడారు. 60 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆపద్బాంధవిలా నిలుస్తూ, సామాజిక సేవలు అందిస్తోందన్నారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు అనంతపురంలోని వెనుకబడిన ప్రాంతాలను చూసి చలించి పోయారన్నారు.
ఆర్డీటీ సంస్థను స్జాపించి పేదలకు విద్య, వైద్య సేవలు అందించారన్నారు ఎస్. స‌విత‌. ఇళ్లు లేని వేలాది మందికి గృహ సదుపాయం కల్పించారని, మరికొందరు పేదలకు వ్యవసాయం కోసం భూములిచ్చారని, ఆధునిక పనిముట్లు అందిస్తూ రైతులకు తోడుగా నిలిచారని కొనియాడారు. ముఖ్యంగా, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందజేశారని, ఎందరో అనంతపురం క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సందర్భాలు ఉన్నాయన్నారు మంత్రి. ఆర్డీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో ఎందరో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అత్యవసర చికిత్స కోసం బెంగళూరుకో, హైదరాబాద్‌కో వెళ్లాల్సిన అవసరం తప్పిందన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ఈ ఆసుపత్రి ఓ వరమన్నారు. వేలాది మంది పేద బిడ్డలను చదివించి ఆ సంస్థ ప్రయోజకులను చేసిందని మంత్రి కొనియాడారు.
The post ‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షాAmit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా

    దిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఎర్రకోట సమీపంలో పేలుడు నేపథ్యంలో.. దేశ రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై నేడు ఉన్నతాధికారులతో

PM Narendra Modi: న్యాయ పరిభాష సులభంగా ఉండాలి – ప్రధాని మోదీPM Narendra Modi: న్యాయ పరిభాష సులభంగా ఉండాలి – ప్రధాని మోదీ

    న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ అవలీలగా అర్థమయ్యేలా చూడాలని… సామాజిక ఆర్థిక నేపథ్యంతో ప్రమేయం లేకుండా ప్రతి పౌరునికీ తేలికగా న్యాయం అందేందుకు ఇది దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. న్యాయశాస్త్ర గ్రంథాల్లోని భాషను

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్

తిరుపతి : ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి