hyderabadupdates.com movies ‘ఇంకో 3 ఏళ్లు కళ్లుమూసుకుంటే చాలు’

‘ఇంకో 3 ఏళ్లు కళ్లుమూసుకుంటే చాలు’

తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పాదయాత్రపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర సమయంలో ప్రతి 3 రోజులకు ఒక సారి ఏదో ఒక నియోజకవర్గంలో, మండలంలో బహిరంగ సభ పెడతానని, అందులో చంద్రబాబును కడిగేస్తానని అన్నారు.

చూస్తూ చూస్తూ కూటమి పాలనలో రెండేళ్లయిపోయిందని, కళ్లు మూసి తెరిచే లోపు ఇంకో 3 ఏళ్లు పూర్తవుతాయని తాడేపల్లిలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో జగన్ వ్యాఖ్యానించారు.

ఈ మూడేళ్లలో ఏడాదిన్నర ఓపిక పడితే చాలని, చివరి ఏడాదిన్నర తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, 150కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుతానని అన్నారు.

ప్రజల ఉప్పెనను చూపిస్తూ, ప్రజా సమస్యలను లేవనెత్తి కూటమి పాలనను ఎండగడతామని అన్నారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి సభ ఉంటుందని వెల్లడించారు.

అయితే, రెండోసారి కూడా జగన్ పాదయాత్రను నమ్ముకుంటున్నారు. కానీ, గత పాదయాత్ర నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు జనం కూడా జగన్ కు ఒక్క చాన్స్ ఇద్దామని ఫిక్సయ్యారు. కానీ, ఆల్రెడీ ఒకసారి జగన్ పాలనను చూసిన జనం…ఇంకో చాన్స్ ఇస్తారా అన్నది అనుమానమే.

వైఎస్సార్, చంద్రబాబు, జగన్, లోకేశ్…ఇలా అందరికీ పాదయాత్ర సెంటిమెంట్ ఒకసారి వర్కవుట్ అయింది. మరి, మరోసారి వర్కవుట్ అవుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అయితే, రెండోసారి పాదయాత్ర చేసి అధికారం చేపట్టిన మొదటి నేతగా జగన్ నిలుస్తారు.

“ఈసారి 150 పైచిలుకు నియోజకవర్గాల్లో నా పాదయాత్ర ఉంటుంది.ప్రతీ మూడోరోజు ఒక బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడిని కడిగేస్తాం.”– #YsJagan pic.twitter.com/9RlMHIb3Zg— Gulte (@GulteOfficial) January 28, 2026

Related Post

అవసరమైన ప్రతిభ చూపించిన అనస్వరఅవసరమైన ప్రతిభ చూపించిన అనస్వర

ఇటీవలే విడుదలైన ఛాంపియన్ ద్వారా మలయాళ కుట్టి అనస్వర రాజన్ పరిచయమయ్యింది. రామ్ చరణ్ అంతటి స్టారే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మీద పొగడ్తల వర్షం కురిపించడమే కాక స్వంతంగా డబ్బింగ్ చెప్పడం గురించి గొప్పగా వర్ణించాడు. అంతగా