బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్, ఇండియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో సంచలన ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వచ్చే ఫిబ్రవరి నెలలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీ జరగనుంది. ఈ సందర్బంగా ఇండియాలో ఆడే క్రికెట్ మ్యాచ్ లను తాము ఆడబోమంటూ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కీలక లేఖ రాసింది ఐసీసీకి. దీనిపై పరిశీలించాలని కోరింది. ఇదిలా ఉండగా ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి వ్యతిరేకంగా తన వైఖరిని ధృవీకరించింది . తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇందులో రెండో నిర్ణయం అనేది లేనే లేదని స్పష్టం చేసింది.
ఇప్పటికే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ఏడాది లో భారత్ ఆపరేషన్ సిందూర్ యాక్షన్ చేపట్టింది. దెబ్బకు పాకిస్తాన్ దిగి వచ్చింది. చివరకు పాకిస్తాన్ , ఇండియా దేశాల జట్ల మధ్య ఆయా దేశాలలో మ్యాచ్ లు జరగడం లేదు. కేవలం తటస్థ ప్రదేశాలలో మాత్రమే మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అయితే ఐసీసీ మాత్రం రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తే మ్యాచ్ లలో భారీగా కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి, భారతదేశంతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఆటలను శ్రీలంకకు మార్చాలని బోర్డు ఐసీసీని అభ్యర్థించింది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
The post ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం
Categories: